కవితకు ‘చేదు’ మిగిల్చిన ఉగాది పండుగ

ఉగిదిపచ్చడిని తెలుగువాళ్ళందరు బాగానే ఆస్వాధిస్తారు. అయితే కల్వకుంట్ల కవితకు మాత్రం మిగిలిన రుచులన్నీ పక్కకుపోయి కేవలం వేపపువ్వు చేదుమాత్రమే గుర్తుండిపోతుంది.

Update: 2024-04-09 07:18 GMT

ఉగాది అంటే అందరికీ షడ్రుచుల పండుగ. షడ్రుచులు ఎందుకంటే ఉగాదిపచ్చడిలో వేపపువ్వు, బెల్లం, మిరియాలపొడి, మామిడికాయ, అరటిపండు లాంటి రుచులను కలుపుతారు. అందుకనే ఉగాడిపచ్చడిలో తీపి, పులుపు, కాస్త కారం, చేదు లాంటి రుచులు కలుస్తాయి. ఏడాదికి ఒక్కరోజు మాత్రమే చేసుకునే ఉగిదిపచ్చడిని తెలుగువాళ్ళందరు బాగానే ఆస్వాధిస్తారు. అయితే కల్వకుంట్ల కవితకు మాత్రం మిగిలిన రుచులన్నీ పక్కకుపోయి కేవలం వేపపువ్వు చేదుమాత్రమే గుర్తుండిపోతుంది. ఎందుకంటే తనకు బెయిల్ ఇవ్వాలన్న కవిత పిటీషన్ను రౌజ్ ఎవిన్యు కోర్టు కొట్టేసింది. అలాగే ఈనెల 23వ తేదీవరకు జ్యుడీషియల్ రిమాండు విధిస్తు కోర్టు మంగళవారం అంటే ఉగాదిపండుగ నాడు తీర్పిచ్చింది.

నిజంగా కవితకు దెబ్బమీద దెబ్బపడినట్లుగానే భావించాలి. ఎందుకంటే ఈడీ ప్రత్యేక న్యాయస్ధానం సోమవారం కవిత బెయిల్ పిటీషన్ను కొట్టేసింది. తనకొడుకు చదువుకుంటున్నాడని, పరీక్షలు రాసేటపుడు తాను పక్కనే ఉండాలని కవిత బెయిల్ పిటీషన్లో చెప్పింది. కొడుకు సెంటిమెంటు ప్రయోగిస్తే కోర్టు బెయిల్ ఇస్తుందని అనుకున్నట్లున్నారు. అయితే ఈడీ ప్రత్యేక న్యాయస్ధానం జడ్జి కావేరి భవేజా ముందు సెంటిమెంటు అస్త్రం పనిచేయలేదు. కవిత ఊహించని రీతిలో జడ్జి చాలా ప్రశ్నలే సంధించారు. కవిత పక్కనలేకపోతే కొడుకు పరీక్షలకు ప్రిపేరవ్వలేడా అన్న ప్రశ్న చాలా కీలకమైంది. అలాగే కవిత లేకపోతే ఏమైందో తండ్రి, దగ్గర బంధువులు చాలామంది ఉన్నారు కదాని నిలదీసింది. కొడుకు పరీక్షల పేరుతో పిటీషన్ వేయటం ఏమాత్రం సమంజసం కాదని జడ్జి అభిప్రాయపడ్డారు.

ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే రౌస్ ఎవిన్యు కోర్టయినా తనకు బెయిల్ ఇస్తుందని కవిత ఆశించగా ఇక్కడా చేదు ఫలితమే ఎదురైంది. 23వ తేదీవరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉండక తప్పటంలేదు. ఇదే సమయంలో కవితను జైల్లో విచారించేందుకు సీబీఐ అధికారులు రెండోరోజు తీహార్ జైలుకు చేరుకున్నారు. జైలులో తనను విచారించటాన్ని అభ్యంతరం వ్యక్తంచేస్తు కవిత వేసిన పిటీషన్ పై విచారణ జరగుతోంది. మరి ఈ పిటీషన్ పై కోర్టు ఏమంటుందో చూడాలి. కవితను జైల్లో విచారించేందుకు కోర్టే సీబీఐకి అనుమతిచ్చింది కాబట్టి ఇక్కడ కూడా కవితకు చుక్కెదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

రౌస్ ఎవిన్యు కోర్టు తీర్పు తర్వాత జైలుకు చేరుకున్న కవిత నాలుగు పేజీల లేఖను విడుదలచేశారు. లిక్కర్ స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధంలేదని ఒకచోట, తాను ఎవరి నుండి ఎలాంటి ఆర్ధికలబ్ది పొందలేదని మరోచోట లేఖలో చెప్పారు. తనను రాజకీయంగా కుట్రచేసి ఇరికించారన్నారు. తన మొబైల్ నెంబర్ ను టీవీల్లో చూపించి ప్రైవసీకి విఘాతం కలిగించారని ఆరోపించటమే విచిత్రంగా ఉంది. రాజకీయ నేతైన కవిత మొబైల్ నెంబర్ ఇప్పటికే కొన్ని వందల మంది దగ్గరుంటుంది. అలాంటిది కవిత మొబైల్ నెంబర్ ను టీవీల్లో ప్రదర్శించి ప్రైవేసీకి ఇబ్బంది కలిగించటం ఏమిటో అర్ధంకావటంలేదు. తనకు స్కామ్ తో సంబంధంలేదని చెబుతున్న కవిత తన మొబైల్ ఫోన్లను ఎందుకు పగలగొట్టారో మాత్రం చెప్పలేదు.

దర్యాప్తుసంస్ధల విచారణ కన్నా మీడియా విచారణ చాలా ఎక్కువగా ఉందని తెగ బాధపడిపోయారు. ఈ విషయంలో ఎవరు ఏమీ చేయలేరని కవితకు తెలీదా ? తమ ప్రత్యర్ధులపైన కూడా మీడియా ఇదే విధంగా కేసుల వెంటపడి ప్యారలెల్ గా విచారణ చేసినపుడు కవిత ఏమీ ఎందుకు మాట్లాడలేదు ? తాను ఈడీ, సీబీఐకు సహకరిస్తున్నట్లు చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. కేసుతో సంబంధంలేదు కాబట్టి తనను విచారించేందుకు లేదని, తనింట్లో మాత్రమే తనను విచారించాలని విచారణను అడ్డుకుంటు కోర్టుల్లో కవిత కేసులు వేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇపుడేమో తన రాజకీయ పరపతిని దెబ్బతీసేట్లుగా వ్యవహరిస్తున్నారని గోలచేస్తే ఏమొస్తుంది. ఆల్రెడి స్కామ్ లో కవిత పాత్రపైన ఈడీ సమర్పించిన సాక్ష్యాలతో ఏకీభవించింది కాబట్టే కోర్టు రిమాండు మీద రిమాండ్ విధిస్తున్న విషయాన్ని కవిత మరచిపోయారేమో.

Tags:    

Similar News