తోపుడు బండిపై ‘అమ్మ’ను ఊరంతా..
అమ్మ కోరికను తీర్చిన కుటుంబ సభ్యులు
By : The Federal
Update: 2025-10-16 14:47 GMT
అనారోగ్యంతో మంచానికే పరిమితమైనమైన వృద్దురాలిని సంతోషపరచడానికి కుటుంబ సభ్యులు వెరైటీగా ఆలోచించారు. జగిత్యాల జిల్లా వేంపేట గ్రామానికి చెందిన 90 ఏళ్ల శ్రీరాముల నర్సమ్మ అడుగు తీసి అడుగువేయలేని పరిస్థితి. వృద్దాప్య సమస్యలు వెంటాడటంతో ఆమె మంచానికే పరిమితమయ్యారు. బయట తిరగాలన్న ఆమె కోరికను కుటుంబ సభ్యులు తీర్చారు. కొడుకు, కోడలు, మనవళ్లు నర్సమ్మను తోపుడు బండిపై కూర్చోబెట్టి గ్రామమంతా తిప్పారు. బంధువుల ఇళ్లకు తీసుకెళ్లారు. గ్రామంలోనే ఉన్న కూతురు ఇంటికి తీసుకెళ్లారు. అక్కడే భోజనం చేయించి తిరిగి ఇంటికి తీసుకెళ్లారు.నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి రుణం తీర్చుకోవడానికి ఆ కుటుంబం చేసిన విన్నూత్న ఆలోచనకు గ్రామస్థులు హర్షం వెలిబుచ్చారు.