మెదక్ బిఆర్ఎస్ టికెట్ లొల్లి
కలవరపాటుకు గురైన పద్మాదేవెందర్ రెడ్డి
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పటికీ బిఆర్ఎస్ లో ఇప్పటి నుంచే టికెట్ల పంచాయతీ ప్రారంభమైంది. మెదక్ అసెంబ్లీ బిఆర్ఎస్ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని ఆ పార్టీ నేత కంఠారెడ్డి తిరుపతి రెడ్డి ప్రకటించుకున్నారు. దీంతో మెదక్ జిల్లా బిఆర్ఎస్ లోకలవరం ప్రారంభమైంది.
మెతుకు సీమగా పేరున్న మెదక్ జిల్లాలో పద్మాదేవెందర్ రెడ్డికి దిక్కారస్వరం వినిపిస్తుంది. మెదక్ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షురాలైన పద్మాదేవేందర్ రెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ప్రారంభమైంది. జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షురాలిగా ఆమె చక్రం తిప్పుతున్నప్పటికీ బిఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నేత పద్మాదేవెందర్ రెడ్డికి పోటీగా రాజకీయాలు ప్రారంభించడం పద్మాదేవెందర్ రెడ్డి వర్గీయుల్లో ఆందోళన ప్రారంభమైంది.
పద్మాదేవెందర్ రెడ్డి గత ఎన్నికల్లో బిఆర్ఎస్ నుంచి మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు చేతిలో ఓడిపోయారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పద్మాదేవెందర్ రెడ్డి మెదక్ నుంచి మళ్లీ పోటీ చేయనున్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బిఆర్ ఎస్ నేత కంఠారెడ్డి తిరుపతి రెడ్డి షాక్ ఇచ్చారు. నిజాంపేటలోకాంగ్రెస్ బాకీ కార్డ్ పంపిణీ కార్యక్రమంలో చేసిన ఆయన చేసిన వ్యాఖ్యలు పద్మాదేవెందర్ రెడ్డిని కలవరపరిచింది. నిజాంపేటకు చెందిన తిరుపతి రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ టికెట్ తనకే అని చేసిన వ్యాఖ్యలు మెదక్ జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. కెసీఆర్ , హరీష్ రావు, కెటిఆర్ లపై తనకు పూర్తినమ్మకం ఉందని కంఠారెడ్డి అన్నారు.
గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి మెదక్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానం మైనంపల్లి రోహిత్ రావు పేరును అనౌన్స్ చేయడంతో కంఠారెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడి పదవికి రాజీనామా చేసి బిఆర్ఎస్ లో చేరారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పద్మాదేవెందర్ రెడ్డి విజయానికి కృషిచేశారు. కాంగ్రెస్ మెదక్ జిల్లా నాయకులు బిఆర్ఎస్ లో చేరడానికి కారణమయ్యారు. మెదక్ జిల్లాలో ద్వితీయ శ్రేణి నేతగా గుర్తింపు ఉన్న తిరుపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆశిస్తున్న మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటన చేయడంతో ఆమె వర్గీయులు షాక్ అవుతున్నారు. బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలైన పద్మాదేవెందర్ రెడ్డికి వ్యతిరేకంగా దిక్కారస్వరం వినిపించడంతో బిఆర్ఎస్ లో వివాదం రాజుకుంది.
కంఠారెడ్డి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మెదక్ జిల్లాలో చురుకైన పాత్ర పోషించినప్పటికీ గత ఎన్నికల్లో బిఆర్ఎస్ లో చేరినప్పటి నుంచి ద్వితీయ శ్రేణి నేతగా మిగిలిపోయారు. మెదక్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలన్న తన చిరకాలవాంఛ కాంగ్రెస్ లో నెరవేరకపోవడంతో బిఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ తో బాటు బిఆర్ఎస్ కేడర్ ను తన వైపుకు తిప్పుకోవడంతో పద్మాదేవెందర్ రెడ్డి తనకు పోటీగా వస్తున్న కంఠారెడ్డి కదలికలపై ఓ కన్నేసింది.