‘బీఆర్ఎస్ నేతలు యాసిడ్ దాడులు చేసుకుంటున్నారు’ : రేవంత్
‘‘కారుపార్టీనేతలు కడుపులో కత్తులు పెట్టుకుని కావలించుకున్నట్లుగా వ్యవహరిస్తున’’ట్లు రేవంత్ చురకలంటించారు;
బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలు, కల్వకుంట్ల కవిత(Kavitha) చేసిన ఆరోపణలపై ఎనుముల రేవంత్ రెడ్డి స్పందించారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ఉన్న రేవంత్(Revanth) బహిరంగసభలో మాట్లాడుతు ‘‘బీఆర్ఎస్(BRS)లో జరుగుతున్న పంచాయితీలోకి తనను లాగవద్ద’’న్నారు. ‘‘బీఆర్ఎస్ పార్టీనేతలు ఒకరిపై మరొకరు యాసిడ్ దాడులు చేసుకుంటున్నట్లుగా తయారయ్యార’’ని ఎద్దేవా చేశారు. ‘‘కారుపార్టీనేతలు కడుపులో కత్తులు పెట్టుకుని కావలించుకున్నట్లుగా వ్యవహరిస్తున’’ట్లు రేవంత్ చురకలంటించారు. ‘‘బీఆర్ఎస్ ను కాలగర్భంలో కలిసిపోతున్న పార్టీ’’గా రేవంత్ అభివర్ణించారు.
ఎవరో చెత్తగాళ్ళ వెనుక తాను ఎందుకు ఉంటానని రేవంత్ ప్రశ్నించారు. ‘‘ప్రజలు తిరస్కరించిన నేతలవెనుక తాను ఎందుకు ఉంటాన’’ని కవిత ఆరోపణలకు రేవంత్ ధీటుగా సమాధానమిచ్చారు. ‘‘బీఆర్ఎస్ నేతలు కాలంచెల్లిన వెయ్యి రూపాయల నోటులాంటి వాళ్ళు’’ అని ఎద్దేవా చేశారు. జనాలు బీఆఱ్ఎస్ ను తిరస్కరించినట్లు చెప్పారు. ‘‘అధికారంలో ఉన్నపుడు జరిగిన విషయాలపై బీఆర్ఎస్ నేతలు ఇపుడు తీరిగ్గా పంచాయితీలు పెట్టుకుంటున్న’’ట్లు వ్యగ్యంగా అన్నారు. ‘‘గతంలో ఇంకోరిని ఎదగనీయని నేతలు ఇపుడు పంచాయితీలు పెట్టుకున్నార’’ని రేవంత్ మండిపడ్డారు. ‘‘తాను ఎవరి వెనుక ఉండనని ఉంటే ముందే ఉంటాన’’ని రేవంత్ అన్నారు. ‘‘బీఆర్ఎస్ గొడవలను పట్టించుకునేంత తీరిక తమకు లేదు కాబట్టి తమను గొడవల్లోకి లాగద’’న్నారు.
ఎంతో గొప్పపేరున్న జనతా పర్టీనే కాలగర్భంలో కలిసిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. ‘‘జనతా పార్టీకన్నా బీఆర్ఎస్ గొప్పది కాద’’ని రేవంత్ అన్నారు. ‘‘తెలంగాణలో టీడీపీ కూడా ఒకపుడు చాలా గొప్పపార్టీ’’గా గుర్తుచేశారు. ‘‘ఎంతోమంది నేతల ఎదుగుదలకు టీడీపీ అవకాశం ఇచ్చింది’’ అని చెప్పారు. ‘‘అలాంటి పార్టీలే కనుమరుగైపోయినపుడు బీఆర్ఎస్ లెక్కేమిటి’’ అన్నారు. ‘‘ప్రకృతి అందరికీ గుణపాఠాలు చెబుతుంద’’ని రేవంత్ అన్నారు. కొందరి కుట్రల వల్ల తెలంగాణ ఇబ్బందులు పడుతోందని రేవంత్ మండిపడ్డారు.