ఓయూ వీసీ పేరుతో ఫేక్ లెటర్.. బీఆర్ఎస్ నేత అరెస్ట్

బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంతంగి చెక్ పోస్ట్ వద్ద అరెస్ట్ చేశారు. ఆయన అరెస్టుపై BRS కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు

Update: 2024-05-01 17:08 GMT

బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంతంగి చెక్ పోస్ట్ వద్ద ఆయన్ని అరెస్ట్ చేశారు. క్రిశాంక్ OU వీసీ పేరుతో ఫేక్ లెటర్స్ క్రియేట్ చేసినట్టు కాంగ్రెస్ నేతలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాటర్, కరెంట్ కొరతతో హాస్టల్స్ మూసివేస్తున్నట్టు ఓయూ వీసీ పేరుతో సర్క్యులర్ బయటకి వచ్చింది. దీనిపై ఓయూ వీసీ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సదరు సర్క్యులర్ ని ఫేక్ గా పోలీసులు గుర్తించారు. దీని వెనుక క్రిశాంక్ హస్తం ఉన్నట్టు అధికారులు భావించారు. దీంతో ఆయన్ని బుధవారం అరెస్టు చేశారు. ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం పోలీసులు క్రిశాంక్‌ను సికింద్రాబాద్ జడ్జి ఇంట్లో హాజరు పరిచారు. కాంగ్రెస్ ని బద్నామ్ చేసేందుకు ఫేక్ సర్క్యులర్ క్రియేట్ చేసినట్టు క్రిశాంక్ పైన కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

కాగా మన్నే క్రిశాంక్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ గా పని చేస్తున్నారు. ఆయన కన్వీనర్‌గా పార్టీ సభ్యులు, కమిటీల డేటా బేస్, పార్టీ వెబ్‌సైట్, సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్స్‌ తదితరాల నిర్వహణతోపాటు ప్రత్యర్థి పార్టీలు చేసే ప్రచారాన్ని తిప్పికొడుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఓయూ సెలవులకి సంబంధించిన వివాదంపైనా ఆయన సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు.

Tags:    

Similar News