బీఆర్ఎస్ చెప్పేవన్నీ అబద్ధాలే: శ్రీధర్ బాబు
అభివృద్ధి ని అడ్డుకోవాలని,BRS రాష్ట్ర సంక్షేమానికి విరోధులగా మారారు. HCU ప్రభుత్వ భూమి అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అందరికి తెలుసు అని ఆయన అన్నారు.;
తమను నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు సుభిక్ష పాలన అందించాలని తమ ప్రభుత్వం నిశ్చయించుకుందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. అందులో భాగంగానే బాధ్యతాయుతంగా ప్రజలకు అద్భుతమైన పాలన అందించాలన్న ఆలోచనతో మూసీ ప్రక్షాళన చేపట్టామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కలలో కూడా ప్రజలకు హాని జరగనివదని వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బాద్యతాయుతంగా పని చేయాలని మూసి ప్రక్షాళన చేస్తున్నాం. ప్రకృతి కాలుష్యం తరిమి కొట్టాలని,మూసి పరివాహక ప్రజలకు స్వచ్ఛమైన గాలి ని అందించాలని ప్రభుత్వం ముందుకు నడుస్తుంది’’ అని వ్యాఖ్యానించింది.
‘‘అభివృద్ధి ని అడ్డుకోవాలని,BRS రాష్ట్ర సంక్షేమానికి విరోధులగా మారారు. HCU ప్రభుత్వ భూమి అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అందరికి తెలుసు. తొమ్మిది ఏండ్ల క్రితం రాజస్థాన్ లో చనిపోయిన జింక పిల్లను HCU లో చనిపోయినట్లు చూపించారు. ఏనుగులు HCU పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు AI ద్వారా చూపించారు. సోషల్ మీడియాను ఉపయోగించుకొని మా ప్రభుత్వం పై కుట్రలు చేస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగొద్దని అడ్డుకుంటున్నారు. 5200 కోట్ల భూమిని 30వేల కోట్లకు చూపించారని కేటిఆర్ అంటుండు. CBI (సెక్యూరిటీ బ్యూరో ఆప్ ఇండియా) అనే రియలేస్టేట్ సంస్థ ద్వారా చేసిన సర్వే ప్రకారం 23వేల కోట్ల వాల్యూ వచ్చింది’’ అని స్పష్టం చేశారు.
‘‘SEBI,RBI నిర్దారణ చేసింది. లోన్ ICICI బ్యాంక్ ఇవ్వలేదు. HCU భూమి పై సుప్రీం కోర్టు లో ఏవిధమైన వ్యాజ్యాలు లేవు. TGIIC మార్కెట్ ఫోర్ సెస్ ద్వారా 37 అంతర్జాతీయ సంస్థల నుండి ముచువల్ పెట్టుబడులు బాండ్ల ద్వారా ప్రభుత్వం సేకరించింది. తక్కువ ఇంట్రెస్ట్ తో ప్రభుత్వ సంక్షేమం కోసం నిధులు సేకరించాం. డివేంచేర్ ట్రస్టీ HCU భూములు ప్రభుత్వానియేనని క్లీయర్ గా చెప్పింది. 5th డిసెంబర్ 2024 లో 9,వేల 995 కోట్ల బాండ్ల ద్వారా నిధులను సేకరించింది ప్రభుత్వంజ 9.35 ఇంట్రెస్ట్ తో నిధులు సేకరణ జరిగింది. SEBI లో రిజిస్టర్ అయిన మర్చంట్ బ్యాంకర్ ను TGIIC నియమించుకుంది. ట్రస్ట్ ఇన్వెస్ట్ ఇండస్ట్రీ సంస్థ ఇతర రాష్ట్రాలకు నిధులు సమకూర్చింది’’ అని తెలిపారు.
‘‘రైతుల సంక్షేమం,రైతు భరోసా, రైతు ఋణమాపి కి ఆ నిధులను ఉపయోగించాం. REC, PFC BOB నుండి 10.09% కు BRS ప్రభుత్వం తీసుకుంది. BRS కంటే కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ ఇంట్రెస్ట్ కు తీసుకుంది. TGIIC ద్వారా 8,476,కోట్లు రూపాయలు ప్రభుత్వం తీసుకుంది. వాటిలో ఋణమాపి కి 2వేల146 కోట్లు. రైతు భరోసా కు 5వేల 463 కోట్లు ఉపయోగించుకుంది. సన్నబియ్యం కోసం 947 కోట్లు రూపాయలు ప్రభుత్వం ఉపయోగించింది. సీఎం రేవంత్ రెడ్డి దురదృష్టి తో 400 అభివృద్ధి చేస్తా అంటే అడ్డుకుంటున్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో BRS నేతలు ఎందుకు విషం కక్కుతున్నారు’’ అని విమర్శించారు.