సింగిల్‌గానే అధికారంలోకి వస్తా: కేసీఆర్

బెల్లం ఉన్నదగ్గరే ఈగలు ముసురుతాయన్నట్లు తెలంగాణను దోచుకోవడానికి ఎక్కడెక్కడి వారు వస్తున్నారని కేసీఆర్ పేర్కొన్నారు.;

Update: 2025-03-22 12:39 GMT

తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని పన్నాగాలు చేసినా ప్రజల గుండెల్లో నుంచి బీఆర్ఎస్‌ను తొలగించలేరిన అన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ మళ్ళీ సింగిల్‌గానే అధికారంలోకి వస్తుందని నొక్కివక్కానించారు. గోదావరఖని నుంచి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేరపట్టిన పాదయాత్ర కేసీఆర్ ఫామ్‌హౌస్ ఉన్న ఎర్రవెల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా పాదయాత్ర బృందంతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘బెల్లం ఉన్నదగ్గరే ఈగలు ముసురుతాయన్నట్లు తెలంగాణను దోచుకోవడానికి ఎక్కడెక్కడి వారు వస్తున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇబ్బందులు కలలో కూడా లేవు. కానీ ఇప్పుడు రాష్ట్రమంతా సమస్యలే కనిపిస్తున్నాయి. సమస్యలు, అప్పుల ఊబిలో రాష్ట్రం చిక్కుకుంది. ఏది ఏమైనా తెలంగాణ కోసం పోరాడేది బీఆర్ఎస్ ఒక్కటే. అందరూ ఒక్కో కేసీఆర్‌లా తయారు కావాలి. కాంగ్రెస్ నోటికొచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి’’ అని పిలుపునిచ్చారు కేసీఆర్

Tags:    

Similar News