జేబులో పేలిన సెల్ ఫోన్

అత్తాపూర్ లో యువకుడికి తీవ్ర గాయాలు;

Update: 2025-07-04 12:34 GMT

రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్ నియోజకవర్గంలోని అత్తాపూర్ లో సెల్ ఫోన్ పేలి ఓ యువకుడు ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చేరాడు. ప్రస్తుతం ఆ యువకుడు ప్రాణాపాయం నుంచి బయటపడినప్పటికీ పేలుడు ధాటికి మరికొంతకాలంగా కోలుకునే అవకాశం లేదు.

అత్తాపూర్ కు చెందిన శ్రీనివాస్ పెయింటింగ్ వేస్తూ భార్య పిల్లలను పోషించుకునే వాడు.  శుక్రవారం అతను వినియోగించే వీవో స్మార్ట్ ఫోన్ సడెన్ గా జేబులో పేలింది. నడుచుకుంటూ వెళుతున్న శ్రీనివాస్  ఈ పరిణామాన్ని ఊహించలేకపోయాడు.      ప్యాంటు జేబులో పెట్టుకున్న సెల్ ఫోన్       పేలింది.

శ్రీనివాస్ తన జేబులో మెల్లి మెల్లిగా సెల్ ఫోన్ వేడి అయిన విషయాన్ని ముందే పసిగట్టాడు. కానీ పేలుతుంది అని ఊహించలేకపోయాడు. అతని ప్యాంటు కుడి జేబు పూర్తిగా కాలిపోయింది. జేబులో నుంచి సెల్ ఫోన్ తీసి విసిరి వేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్ష్యు   లు తెలిపారు.

ఇటీవలె ఎపిలోని అన్నమయ్య జిల్లాలో సెల్ ఫోన్ పేలిన సంగతి తెలిసిందే.వరుసగా సెల్ ఫోన్లు పేలడంతో ప్రజలు కలవరపడుతున్నారు.

చాలా మంది సెల్ ఫోన్లు డిశ్చార్జ్ అయ్యిందని రాత్రిపూట చార్జింగ్ పెట్టి పడుకుంటారు. సెల్ ఫోన్ పుల్ చా ర్జ్ అయ్యే ముందు దాన్ని చార్జింగ్ ఆపేయాలి. లేకపోతే ఓవర్ హీటింగ్ వల్ల సెల్ ఫోన్లు పేలతాయని నిపుణులు ఫెడరల్ ప్రతినిధితో చెప్పారు.

Tags:    

Similar News