"నీ శని వదులుతుంది".. సై అంటే సై అంటోన్న రేవంత్
దూలం లెక్క పెరిగేతే కాదు, దూడకి ఉన్న బుద్ధి అయినా హరీష్ రావుకి ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హరీష్ రావు సవాల్ స్వీకరిస్తున్నానని ప్రకటించారు.
దూలం లెక్క పెరిగేతే కాదు, దూడకి ఉన్న బుద్ధి అయినా హరీష్ రావుకి ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హరీష్ రావు సవాల్ స్వీకరిస్తున్నానని ప్రకటించారు. శుక్రవారం కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ తో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరీష్ రావు పై తనదైన శైలిలో పాడునని విమర్శలు చేశారు.
నేను పంద్రాగస్టు లోపల రెండు లక్షల రుణమాఫీ చేస్తానంటే.. "నువ్వు పంద్రాగస్టు లోపల రుణమాఫీ చేయకపోతే రాజీనామా చెయ్యాలి. రుణమాఫీ చేస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, మళ్ళీ సిద్ధిపేట నుండి పోటీ చేయను" అని హరీష్ రావు అన్నాడు అని రేవంత్ చెప్పారు. నేను ఆ సవాల్ ని స్వీకరిస్తూ.. రాజీనామా చిట్టి జేబులో పెట్టుకో, పంద్రాగస్టు లోపల సిద్దిపేటకు నీ శని వదులుతుంది. చింతమడక పోయి చింత చెట్టు కింద పడుకో" అని హరీష్ రావుకి చెప్పిన అన్నారు రేవంత్.
"కానీ ఈరోజు అమరవీరుల స్థూపం వద్ద హరీష్ రావు ఏమంటున్నాడు? ఆయన మోసానికి ముసుగే అమరవీరులు స్థూపం. ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే అప్పుడు ఆ ముసుగు వెనక దాక్కుని అబద్దాలు చెప్తాడు. ఈరోజు కూడా పోయి రుణమాఫీ గురించి కాకుండా ఇంకా ఏవేవో కండిషన్లు చెప్పి ఇవన్నీ చేస్తే రాజీనామా చేస్తానంటున్నాడు. ఆయన రాజీనామా లేఖ మామ చెప్పిన సీసా పద్యం రాసుకొచ్చినట్టు ఉంది. రాజీనామా ఫార్మాట్ అలా ఉండదు. స్పీకర్ ఒక ఫార్మాట్ ఇస్తాడు, అలానే ఉండాలి.. ఒక్క మిస్టేక్ అయినా అది చెల్లదు. ఆయన అలా కాకుండా ఇష్టమొచ్చినట్టు రాసుకొచ్చాడు. తాటి చెట్టులెక్క పెరిగాడు. మోకాళ్ళ నుండి అరికలులోకి పోయింది ఆయన తెలివి" అని రేవంత్ రెడ్డి హరీష్ రావుని ఘాటుగా విమర్శించారు.
మరోసారి చెప్తున్నా.. పంద్రాగస్టు లోపల రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. నీ రాజీనామా లేఖ రెడీ చేసుకో. రైతులకు రుణమాఫీ చేయకపోతే మాకెందుకయ్యా అధికారం? రైతులు మా పరివారం. వాళ్ళకోసం రూ. ముప్పై వేల కోట్లో లేదా నలభై వేల కోట్లో ఖర్చు పెట్టడం మాకేం పెద్ద సమస్య కాదని స్పష్టం చేశారు.