భారత సైన్యానికి సంఘీభావంగా సీఎం ర్యాలీ

భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కార్యక్రమానికి సంఘీభావంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో గురువారం రాత్రి జరిగిన ర్యాలీ జయప్రదమైంది.;

Update: 2025-05-08 13:44 GMT
సీఎం రేవంత్ ఆధ్వర్యంలో సైన్యానికి సంఘీభావంగా ర్యాలీ

హైదరాబాద్ నగరంలోని నెక్లెస్ రోడ్డులో గురువారం రాత్రి భారత సైన్యానికి సంఘీభావంగా జరిగిన ర్యాలీలో ప్రజల్లో దేశభక్తి పెల్లుబుకింది. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున యువతీయువకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి జాతీయ జెండా చేత పట్టుకొని పోలీసులు, అధికారులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, మిలటరీ అధికారులు వెంటరాగా ర్యాలీలో అగ్రభాగాన నడిచారు.

ఈ ర్యాలీలో తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎ రామకృష్ణారావు, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్,హోం శాఖ సెక్రటరీ రవిగుప్తా తదితరులు పాల్గొన్నారు. టెర్రరిస్టులకు వ్యతిరేకంగా సైన్యం జరుపుతున్న ఆపరేషన్ సింధూర్ కార్యక్రమానికి మద్ధతుగా ఈ ర్యాలీ చేశారు. భక్తిగీతాల హోరు మధ్య ఉద్యోగుల,పోలీసులు, ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ సచివాలయం రాహుల్ గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా ఇందిరాగాంధీ విగ్రహం దాకా సాగింది.


మేరే వతన్ కీ లోగో అనే దేశ భక్తి పాట మారుమోగుతుండగా ర్యాలీ సాగింది. భారత సైన్యానికి సంఘీభావంగా నేడు సాయంత్రం 6 గంటలకు ర్యాలీ నిర్వహణ .సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ సాగింది. దేశ భక్తి గీతాల హోరులో జాతీయ జెండాలు చేత పట్టుకొని సైన్యానికి సంఘీభావ ర్యాలీలో పాల్గొన్నారు.




 భారత వీరజవాన్లకు సీఎం జైజేలు

ఆపరేషన్ సింధూర్ ద్వారా మన వీర సైనికులు 140కోట్ల జనాభా సంఘటితమై భారతీయ సైనికులకు సంఘీభావం ప్రకటించారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు వీర జవాన్ల వైపు ఉన్నారని రేవంత్ పేర్కొన్నారు. భారత సైనికులు తలచుకుంటే పాకిస్థాన్ చిత్రపటం ప్రపంచంలో లేకుండా చేయగలరని సీఎం హెచ్చరించారు.భారత వీరజవాన్లకు సీఎం జైజేలు పలికారు. దేశంలో దాడులు చేసే ఉగ్రవాదులను అణచివేసే దాకా నిద్రపోమని సీఎం చెప్పారు.




 సీఎం నినాదాలు 

పాక్ ఉగ్రవాదులు జాగ్రత్త మిమ్మల్ని మా వీర జవాన్లు మిమ్మల్ని మట్టుబెడతారు అని సీఎం చెప్పారు. భారత్ జవాన్ జిందాబాద్, జై హింద్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి నినాదాలు చేయించారు. వందేమాతరం అంటూ సీఎం నినాదాలు చేయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.

రాజకీయాలకు అతీతంగా ఒక్కటవుతాం

దేశ రక్షణలో అందరం ఒక్కటేనని చాటుతూ తెలంగాణ గడ్డ నుంచి భారత జవాన్లకు స్ఫూర్తినిచ్చేందుకే ఈ సంఘీభావ ర్యాలీ అని సీఎం రేవంత్ చెప్పారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి భారత దేశ సార్వభౌమత్వాన్నిదెబ్బతీయాలని చూస్తే సహించేది లేదన్నారు. దేశ రక్షణ విషయంలో రాజకీయాలకు అతీతంగా ఒక్కటవుతామన్నారు. ‘‘మా ఆడబిడ్డల నుదిటి సిందూరం తుడిచేయాలనుకుంటే… వారికి ఆపరేషన్ సిందూర్ తో సమాధానం చెబుతాం.ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు భారత సైన్యానికి మద్దతుగా నిలుస్తాం’’అని సీఎం చెప్పారు.

Tags:    

Similar News