‘కనిపిస్తోంది 400 ఎకరాలే.. కానీ జరుగుతుంది వేల ఎకరాల భూ దందా’
సభకు కూడా అనుమతులు ఇవ్వకుంటే కోర్టును ఆశ్రయించి అనుమతి పొందుతామని, అనుమతి ఇవ్వక పోవడానికి ప్రభుత్వం వద్ద ఇలాంటి కారణాలు లేవని అన్నారు.;
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. హెచ్‌సీయూ వివాదంలో కనిపిస్తోందని 400 ఎకరాలే అయినా దాని వెనక వేల ఎకరాల దందా చేయడానికి రేవంత్ ప్లాన్ చేశారని ఆరోపించారు కేటీఆర్. అతి త్వరలోనే ఈ బాగోతాలన్నీ బయటపెడతానన్నారు. తెలంగాణ అంతా కూడా నెటిగివిటీతో రన్ అవుతోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ సర్పంచ్ నుంచి మార్జీ సీఎం వరకు ప్రతి ఒక్కరిపై కేసులు ఎలా పెట్టాలన్న ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఆలోచన కూడా తమకు లేదని, అలాగని ప్రజలకు అన్యాయం చేస్తుంటూ చూస్తూ ఊరుకోమని మండిపడ్డారు. అనంతరం పార్టీ రజతోత్సవ సభలపై ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ తర్వాత బీఆర్ఎస్ పార్టీనే పాతికేళ్లు పూర్తి చేసుకుంటుందని వ్యాఖ్యానించారు. పార్టీ సిల్వర్ జూబ్లీ సభకు అనుమతుల కోసం డీజీపీని కోరామని, ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకానున్న క్రమంలో ఈ సభ కోసం 3వేల బస్సులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు కేటీఆర్ చెప్పుకొచ్చారు.
‘‘వరంగల్ ఎల్కతుర్తిలో ఎలాంటి ట్రాఫిక్ లేకుండా… ప్రజలకు ఇబ్బంది కానీ ప్రాంతంలో సభ నిర్వహణ జరుగుతుంది. 1200 ఎకరాల్లో పార్కింగ్ తో పాటు సభ ఏర్పాటు అన్ని ఘనంగా జరుగుతున్నాయి. తెలుగునాట విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న రెండు పార్టీలు తెలుగుదేశం, బిఆర్ఎస్ మాత్రమే. అందుకే ఏడాదిపాటు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు చేస్తాం. 28వ తేదీ మార్చి రోజున సభ అనుమతి కోసం జిల్లా పోలీసులకు దరఖాస్తు పెట్టడం జరిగింది. ఈ మేరకు డీజీపీకి వ్యక్తిగతంగా విజ్ఞప్తి కూడా చేశాము’’ అని వివరించారు.
‘‘ఆర్టీసీ ద్వారా 3000 బస్సుల కోసం విజ్ఞప్తి చేశాను ఆర్టీసీ సూత్రప్రాయంగా అంగీకరించింది. 27వ తేదీ ఆదివారం కావడం విద్యార్థులకు సెలవులు ఉండటం ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగవు. 33 జిల్లాల నాయకులు ప్రతినిధులతో కేసీఆర్ గారు స్వయంగా నియోజకవర్గాల వారికి సమీక్ష నిర్వహించారు. పార్టీ పరంగా కమిటీలను వేసుకోవడం జరిగింది. మా పార్టీ చరిత్రలో ఈ సమావేశం ఒక పెద్ద మీటింగ్ అవుతుంది. గతంలో జరిగిన వరంగల్ సభ మాదిరి భారీగా నిర్వహణ చేయబోతున్నాం. బహిరంగ సభ తర్వాత విద్యార్థి , కార్యకర్తల సభ్యత్వ నమోదు చేస్తాం. సభ్యత నమోదు పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుంది’’ అని తెలిపారు.
‘‘సభ్యత్వ నమోదు తర్వాత అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. రాష్ట్ర కమిటీలతో పాటు జిల్లా కమిటీలను ఇతర కమిటీలను వేసుకుంటాం. ఆ తర్వాత జిల్లాల వారీగా కార్యకర్తల శిక్షణ సమావేశాలు ఉంటాయి. ప్రతినెల ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహించేలా 12 నెలలపాటు కొనసాగేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం. ఈ సంవత్సరం మొత్తం సంస్థాగత నిర్మాణంతోపాటు , ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తాం. ప్రభుత్వం గతంలో మా పార్టీ సమావేశాలకు అనుమతులు ఇవ్వకుంటే ఇబ్బందులు పెట్టింది’’ అని విమర్శించారు.
ఈ బహిరంగ సభకు కూడా అనుమతులు ఇవ్వకుంటే కోర్టును ఆశ్రయించి అనుమతి పొందుతామని, అనుమతి ఇవ్వక పోవడానికి ప్రభుత్వం వద్ద ఇలాంటి కారణాలు లేవని, ఇది తమ పార్టీ అత్యంత శాంతియుతంగా నిర్వహించుకుంటున్న ఒక సంబరం మాత్రమేనని అన్నారు.