నేటి నుంచి భూభారతి.. రాత్రికి రాత్రే వేల ఎకరాలు హాంఫట్..

తెలంగాణలో ధరణి పోర్టల్‌ను తొలగించి భూభారత్ చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం.;

Update: 2025-01-01 08:44 GMT

తెలంగాణలో ధరణి పోర్టల్‌ను తొలగించి భూభారత్ చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ చట్టాన్ని 1 జనవరి 2025 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పోర్టల్ నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్‌ఫర్మేటివ్ సెంటర్ చేపట్టింది. రాష్ట్రంలో ఉన్న అన్ని భూ సంబంధిత సమస్యలను పరిష్కరించడం సులభతరం అవుతోందని, ధరణి తెచ్చిన తలనొప్పులకు భూభారత్‌తో చెక్ పెడతామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ చట్టం నేటి నుంచి అమలవుతోంది. గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చిందని, దాని నిర్వహణ బాధ్యతలను క్రిమినల్ కేసుల్లో చిక్కుకున్న సంస్థలకు, విదేశీ సంస్థలకు అందించారని కాంగ్రెస్ విమర్శించింది. కానీ తమ ప్రభుత్వం అలా కాదని, తెలంగాణ రైతుల భూ వివరాలను మన దేశంలోనే ఉంచుతామని అన్నారు. ఈ చట్టానికి సంబంధించిన బిల్లును డిసెంబర్ 18న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ప్రవేశపెట్టారు. డిసెంబర్ 20,21న తేదీల్లో ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. గవర్నర్ ఆమోదం కూడా అందిన వెంటనే ఈ చట్టానికి సంబంధించిన పలు కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రభుత్వం.

ధరణి పోర్టల్ ఇక జనవరి 1నుండి భూ భారతి పోర్టల్‌గా అవతరించింది. టెర్రాసిస్ గడువు డిసెంబర్ 31తో ముగిసింది. జనవరి1 నుండి భూ భారతి పోర్టల్ నిర్వహణను ఎన్‌ఐసీ పూర్తి స్థాయిలో చేపడుతోంది. ఈ క్రమంలో టెర్రాసిన్ తన దగ్గర ఉన్న ధరణి పోర్టల్ సమాచారం మొత్తాన్ని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(NIC)కు అందించనుంది. దీంతో ఫోరెన్సిక్ ఆడిటింగ్ పై సర్కార్ సీరియస్ యాక్షన్ ప్లాన్ కు రెడీ అయింది. దీంతో రెవెన్యూ శాఖ అధికారుల్లో గుబులు మొదలైంది. గత ప్రభుత్వం ధరణి పేరుతో రాత్రికి రాత్రే వందల ఎకరాలు కొల్లగొట్టారని ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేశారు. అర్థరాత్రి ఎవరు లాగిన్ అయ్యారు..ఏ సర్వర్ నుండి ఏ ఐపి అడ్రస్ అయ్యారు,ఏ సర్వే నెంబర్ నిషేధిత జాబితా నుండి తొలగించారు అనే అంశాలపై ఫోకస్ పెట్టారు అధికారులు. ఈ విషయంలో పలు కీలక విషయాలు ఫోరెన్సిక్ ఆడిట్ లో... ధరణి లావా దేవీలు ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా వెల్లడి కానున్నాయి.

సుమారు రూ.2 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల పరం అయ్యాయని ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. నిషేధిత జాబితా భూములు రాత్రికి రాత్రే ఓ పెద్ద మనిషి సమక్షంలో సక్రమం అయ్యాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ పరిధిలోనే సుమారు 15వేల ఎకరాలు హాం ఫట్ అయ్యాయన్నారు. 2014 నుండి రికార్డులు పరిశీలించి..ధరణి పోర్టల్ లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేస్తామని, విచారణ కమిటీ వేసి దోషులను తేల్చే ప్రక్రియను వేగవంతం చేయనున్న తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.

Tags:    

Similar News