కాంగ్రెస్ కు తలనొప్పులు పెరిగిపోతున్నాయా ?

తెలంగాణా కాంగ్రెస్ కు తలనొప్పులు పెరిగిపోతున్నాయి. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్ధులను ఎంపికచేసే విషయంలో ఏకాభిప్రాయానికి రాలేకపోతోంది.

Update: 2024-03-29 06:34 GMT

తెలంగాణా కాంగ్రెస్ కు తలనొప్పులు పెరిగిపోతున్నాయి. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్ధులను ఎంపికచేసే విషయంలో ఏకాభిప్రాయానికి రాలేకపోతోంది. కొన్ని నియోజకవర్గాల్లో పోటీకి నేతలమధ్య తీవ్రమైనపోటీ పెరిగిపోతుండటంతో అభ్యర్ధుల ఎంపిక అధిష్టానానికి కష్టమైపోతోంది. ప్రజల్లో సానుకూలత ఉండటం, కొంచెం కష్టపడితే గెలిచిపోవచ్చనే నమ్మకంతో ఎంపీలుగా పోటీచేసేందుకు ఎక్కువమంది నేతలు గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇక్కడ సమస్య ఏమిటంటే చాలామంది నేతలకు పీసీసీతో పాటు ఏఐసీసీ అగ్రనేతలతో దగ్గర సంబంధాలున్న కారణంగానే ఎవరి స్ధాయిలో వాళ్ళు టికెట్ల కోసం గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అందుకనే అభ్యర్ధుల ఎంపికలో తలనొప్పులు పెరిగిపోతున్నాయి.

మొత్తం 17 నియోజకవర్గాల్లో నాలుగువిడతల్లో అధిష్టానం 13 సీట్లలో అభ్యర్ధులను ఫైనల్ చేసింది. మిగిలిన నాలుగు నియోజకవర్గాలే పార్టీకి తలనొప్పిగా తయారయ్యింది. అలాగే ఒకటి, రెండుసీట్లలో అభ్యర్ధులను మార్చాలనే ఒత్తిడి నాయకత్వం మీద పెరిగిపోతోంది. దాంతో ఏమిచేయాలో తేల్చుకోలేక నాయకత్వం నానా అవస్తలు పడుతోంది. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్, కరీంనగర్ నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపిక కష్టమైపోయింది. అలాగే పెద్దపల్లి నియోజకవర్గంలో అభ్యర్ధి గడ్డం వంశీని మార్చాల్సిందే అని చాలామంది సీనియర్లు పట్టుబడుతున్నారు.

ముందు ఖమ్మం విషయంచూస్తే ఈ లోక్ సభ నియోజకవర్గంలో పోటీచేయటానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భార్య నందిని, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కొడుకు యుగంధర్ గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. టికెట్ తమకే కావాలంటే కాదు తమకే దక్కాలని అధిష్టానంపై బాగా ఒత్తిడి పెడుతున్నారు. భట్టీయేమో బాగా సీనియర్ నేత పైగా ఎస్సీ కాబట్టి రెండు అంశాలను పరిగణలోకి తీసుకోవాలని పట్టుబడుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి పార్టీకి ఆర్ధికదన్ను అందించారు. కాబట్టి టికెట్ తన సోదరుడికి ఇవ్వాల్సిందే అంటున్నారు. అలాగే తుమ్మల కమ్మ సామాజికవర్గంలో ప్రముఖుడు కాబట్టి తమ సామాజికవవర్గానికి ఒక్క టికెట్టు ఇవ్వాల్సిందే ఒత్తిడి పెడుతున్నారు.

ముగ్గురి వాదనల్లోను లాజిక్ ఉందికాబట్టి టికెట్ ఎవరికి ఇవ్వాలన్న విషయాన్ని అధిష్టానం తేల్చుకోలేకపోతోంది. పైగా అసెంబ్లీ ఎన్నికల్లో పది నియోజకవర్గాల్లో తొమ్మిదింటిలో కాంగ్రెస్ గెలిచింది. ఖమ్మం జిల్లాను కాంగ్రెస్ స్వీప్ చేయటానికి పొంగులేటి, తుమ్మలే కారణమని చెప్పాలి. అందుకనే టికెట్ కోసం ఇంత గట్టిగా పట్టుబడుతున్నారు.

కరీంనగర్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కు ధీటుగా అభ్యర్ధిని దింపటంలో కాంగ్రెస్ ఎటు తేల్చుకోలేకపోతోంది. బీఆర్ఎస్ నుండి మాజీ ఎంపి బోయినపల్లి వినోద్ పోటీలో ఉన్నారు. బండి సంజయ్ బీసీ సామాజికవర్గమైతే వినోద్ ఓసీ. కాబట్టి కాంగ్రెస్ నుండి బీసీని పోటీలోకి దింపాలా ? లేకపోతే ఓసీ(వెలమ) అభ్యర్ధిని దింపాలా అన్నది పెద్ద సమస్యగా మారింది. అగ్రవర్ణాల నుండి ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ తరపున గెలిచిన ఒక బీసీ ఎంఎల్ఏని కాంగ్రెస్ లో చేర్చుకుని ఎంపీ టికెట్ ఇచ్చే విషయాన్ని కూడా అధిష్టానం పరిశీలిస్తోందని సమాచారం.

ఇక వరంగల్ అభ్యర్ధిగా పసునూరి దయాకర్, మాజీ ఎంఎల్ఏ దొమ్మాట సాంబయ్య గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. వీళ్ళల్లో ఎవరిని ఎంపికచేస్తే గెలుస్తారనే విషయమై పార్టీ సర్వే చేయించుకుంటోంది. ఇంతలో సడెన్ గా బీఆర్ఎస్ స్టేషన్ ఘన్ పూర్ ఎంఎల్ఏ కడియం శ్రీహరి, ఆయన కూతురు, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి కడియం కావ్య కాంగ్రెస్ లో చేరబోతున్నారు. బీఆర్ఎస్ లో టికెట్ వచ్చినా కాదని కాంగ్రెస్ లో చేరబోతున్నారు కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం కావ్యకు టికెట్ ఇచ్చేవిషయంలో మొగ్గు చూపుతోందని సమాచారం. టికెట్ హామీతోనే కడియం కుటుంబం కాంగ్రెస్ లో చేరుతోందట.

ఇదే విషయమై సీనియర్ కాంగ్రెస్ నేత కొత్తా సీతారాములు మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు మెజారిటి సీట్లు గెలవటం ఖాయమన్నారు. ఖమ్మం, వరంగల్ లాంటి సీట్లే కాకుండా ఇతర నియోజకవర్గాల్లో కూడా జనాల్లో పార్టీకి మంచి సానుకూలత ఉందని చెప్పారు. బీఆర్ఎస్ ఓడిపోయిన దగ్గర నుండి బయటపడుతున్న అనేక కుంభకోణలు, అక్రమాలతో ఆ పార్టీకి బాగా మైనస్ పెరిగిపోతోందన్నారు. తాజాగా బయటపడుతున్న టెలిఫోన్ ట్యాపింగ్ అంశం వ్యక్తిగతంగా కేసీయార్, కేటీయార్ కు బాగా నెగిటివ్ అయినట్లు అభిప్రాయపడ్డారు. కేసీయార్ ఫ్యామిలీ మీద కూడా ట్యాపింగ్ కేసులు తప్పదనే ప్రచారం

Tags:    

Similar News