జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను గెలిపించాలి: పొన్నం
కార్యకర్తలకు మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా అంతా కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ కార్యకర్తలకు మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. కంటోన్మెంట్‌లో పార్టీని ఎలా గెలిపించారో.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కూడా అదే విధంగా కాంగ్రెస్‌కు విజయం అందించాలని అన్నారు. జూబ్లీహిల్స్‌ను అభివృద్ధి చేసే బాధ్యతను సీఎం తీసుకున్నారని, కాబట్టి కాంగ్రెస్‌కు ప్రజలు అవకాశం కల్పించాలని కోరారు. ఎర్రగడ్డ డివిజన్‌లో పలు అభివృద్ధి పనులకు పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగానే పార్టీ కార్యకర్లు, ప్రజలు ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రానున్న జూబ్లీహిల్స్ ఉపెన్నికలో హస్తం పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరారు.
ఎర్రగడ్డ డివిజన్‌లో రూ.2.16 కోట్ల వ్యవయంతో నటరాజ్ నగర్, శంకర్‌లాల్ నగర్, ఛత్రపతి శివాజీ నగర్ దగ్గర సీసీ రోడ్లు వేయడం, నటరాజ్ నగర్, బంజారా నగర్, కమ్యూనిటీ హాల్‌ల పునరుద్దరణకు మంత్రి శంకుస్థాపన చేశారు. దాంతో పాటుగా రూ.54లక్షలతో మురుగు నీటి కాలువల పునరుద్దరణకు శంకుస్థాపన చేశారు. పక్కన ఉన్న ఖాళీ స్థలంలో పార్క్ ఏర్పాటు చేయనున్నారని, ఆదివారం నుంచి పార్క్ నిర్మాణ పనులను షురూ అవుతాయని ఆయన వెల్లడించారు. ఇందులో వాకింగ్ ట్రాక్, పిల్లల గేమ్స్ సహా తదితరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించినట్లు చెప్పారు.
ప్రజలకు తాగునీరు, పరిశుభ్రత సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోందని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన తరవ్ాత హైదరాబాద్‌లో 60వేలకు పైగా రేషన్ కార్డులు పంపిణీ చేశామని, 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితం చేశామని చెప్పారు. వంట గ్యాస్‌ను రూ.500కే అందిస్తున్నామని తెలిపారు. కొందరు తమ పిల్లలను తీసుకొచ్చి సానుభూతితో ఓట్లు అడగాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కానీ ప్రజలు సానుభూతికి కాకుండా అభివృద్ధికే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు.