సునీత రావుకు షోకాజ్ నోటీసులు.. వారం రోజులే టైమ్..

పీసీసీపై సునీత రావు చేసిన వ్యాఖ్యలను పార్టీ క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణించింది.;

Update: 2025-05-21 07:54 GMT

తెలంగాణ కాంగ్రెస్ మహిళా వింగ్ అధ్యక్షురాలు సునీతరావుకు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ పదవుల విషయంలో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌లపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో మహేష్ ఛాంబర్ ముందు ధర్నా చేశారు. ఈ క్రమంలోనే తాజాగా గోషామహాల్ కాంగ్రెస్ మహిళా నేతలు సునీతరావుపై పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారు లేఖ రాసిన మరుసటి రోజే ఈ అంశంపై పార్టీ స్పందించింది. సునీత రావుకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. పీసీసీపై సునీత రావు చేసిన వ్యాఖ్యలను పార్టీ క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణించింది. దీంతో అల్ ఇండియా మహిళ కాంగ్రెస్ షో కాస్ నోటీసులు ఇచ్చింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పీసీసీ అధ్యక్షుడు ఛాంబర్ ముందు ధర్నా చేయడం పీసీసీ, సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై పలువురు మంత్రులు, నేతలు, కార్యకర్తలు హై కమాండ్ కు ఫిర్యాదు చేశారు.

 

సునీతా రావు ఏమన్నారంటే..

పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదు, సహకరించడం లేదని, మరోవైపు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏమో తనను టార్గెట్ చేస్తున్నారని సునీతారావు ఆరోపించారు. ముందుగా మహిళలు 30 మందికి పదవులు ఇస్తామన్నారని, కానీ ఇప్పుడు ఇద్దరితో సరిపెడుతున్నారని వ్యాఖ్యానించారు. తనపై ఎలాంటి చర్యలు తీసుకున్నా.. ఆ తర్వాత ఏం చేయాలో తనకు ఒక క్లారిటీ ఉందని ఆమె పేర్కొన్నారు. ‘‘పదవుల విషయంలో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ ఇద్దరూ కూడా స్పష్టత ఇవ్వట్లేదు. సీఎం రేవంత్‌ను అడిగితే పీసీసీని అడిగి పదవులు తీసుకోవాలని అంటున్నారు. పీసీసీని అడిగితేనేమో సీఎం రేవంత్‌తో మాట్లాడాలి, ఏ పదవి గురించి అయినా ఆయనను అడగాలి అంటున్నారు. మరి ఇక్కడ పదవులు మాకు ఎవరు ఇవ్వట్లేదో అర్థం కావట్లేదు. వీటిని సీఎం ఇస్తారా, పీసీసీ ఇస్తారా అనేది పార్టీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చెప్పాలి. అందుకోసమే ఆమెతో మాట్లాడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాం’’ అని తెలిపారామే. పార్టీ పదవులు ఉంటే, ప్రభుత్వంలో ఉండవు. ప్రభుత్వంలో ఉంటే పార్టీలో పదవులు ఉండవన్న.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. ఎమ్మెల్సీగా, పీసీసీ చీఫ్‌గా ఎలా ఉంటున్నారని కూడా ప్రశ్నించారు.

Tags:    

Similar News