వరంగల్ లో CRPF జవాన్ తుపాకీ కలకలం

వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ జంక్షన్ వద్ద తుపాకీ కలకలం రేపింది. శుక్రవారం ఉదయం ఓ సీఆర్ఫీఎఫ్ జవాన్ SLRN గన్ ని జంక్షన్ లో పారేసుకున్నాడు.

Update: 2024-08-23 12:46 GMT

వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ జంక్షన్ వద్ద తుపాకీ కలకలం రేపింది. శుక్రవారం ఉదయం ఓ సీఆర్ఫీఎఫ్ జవాన్ SLRN గన్ ని జంక్షన్ లో పారేసుకున్నాడు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్న బెటాలియన్ ను తరలించే క్రమంలో గన్ రోడ్డు పైన పడిపోయినట్టు తెలుస్తోంది. ఉదయం పారిశుద్ధ్య కార్మికులు స్థానికంగా విధులు నిర్వహిస్తుండగా గన్ ని గుర్తించారు. వెంటనే పై అధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. మట్వాడ పోలీసులకు గన్ అప్పగించారు. ప్రస్తుతం పోలీసులు దీనిపై ఎంక్వైరీ చేస్తున్నారు. 

Tags:    

Similar News