కెసీఆర్ కు కూతురు, కొడుకు ముఖ్యం కాదు: మల్లారెడ్డి

కవితపై వేటు వేయడం సరైన నిర్ణయం;

Update: 2025-09-03 09:29 GMT

భారత రాష్ట్ర సమితి నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్‌పై ఆ పార్టీ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కూతురు, కొడుకు ముఖ్యం కాదని అన్నారు. పార్టీ ప్రయోజనాలను దెబ్బతీస్తున్న ఆమెపై వేటు వేయడం సరైన నిర్ణయమేనని చెప్పారు. బోయిన్‌పల్లిలో శ్రీవెంకటేశ్వర లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వినాయకుడి ప్రత్యేక పూజా కార్యక్రమంలో మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘కేసీఆర్‌కు బిడ్డ అయినా, కొడుకు అయినా ముఖ్యం కాదు.. ఆయనకు పార్టీయే ముఖ్యమన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సస్పెన్షన్లు ప్రతి పార్టీలో ఉంటాయి. ప్రతి కుటుంబంలో విభేధాలు అత్యంత సహజం. తెలంగాణ ప్రజలే కేసీఆర్‌కు ఇంపార్టెంట్. తన కూతురు, కొడుకు కోసం పార్టీని ఆయన నాశనం చేసుకోలేరు అని మల్లారెడ్డి అన్నారు. కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో సీబీఐ జోక్యం తగదు. సిబిఐ జోక్యం వల్ల ఒరిగేదేమి లేదు. సీబీఐ పేరుతో కేసీఆర్‌ను ఇరుకున పెట్టాలనుకోవడం సరికాదు. ఆయనలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న నాయకుడు దొరకడం తెలంగాణ ప్రజల అదృష్టం అని మల్లారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం అంశాన్ని బూచిగా చూపి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ డ్రామాలు చేస్తోంది’’ అని మల్లారెడ్డి విమర్శించారు.

Tags:    

Similar News