కేసీఆర్‌కు ఆరోగ్యంపై వైద్యులు క్లారిటీ..
హెల్త్ బులెటిన్‌తో పార్టీ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.;
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు క్లారిటీ ఇచ్చారు. ఆయన హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పారు. ఆయన ఆరోగ్యం అంతా బాగానే ఉందన్నారు. ‘‘కేసీఆర్ నీరసంగా ఉండటంతో ఈ సాయంత్రం ఆస్పత్రిలో చేరారు. ఆయన శరీరంలో బ్లడ్ షుగర్ అధికంగా, సోడియం మోతాదు తక్కువగా ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో వెల్లడైంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది’’ అని పేర్కొన్నారు.
ఊపిరి పీల్చుకున్న పార్టీ శ్రేణులు..
సాయంత్రం ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. ఆరోగ్యంపై గంటల తరబడి ఎటువంటి సమాచారం రాకపోవడం, సీఎం ఆరా తీయడంతో పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. తమ నేత ఆరోగ్య పరిస్థితి ఏంటని కంగారు పడ్డారు. ఇప్పుడు వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌తో పార్టీ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.