‘రైతులను ఒత్తిడి చేయొద్దు’

బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు.;

Update: 2025-09-08 08:48 GMT

రైతుల విషయంలో బ్యాంకర్ల నడవడికపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలిచ్చారు. ఆస్తుల తాకట్టు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల పేరుతో రైతులను ఒత్తిడి చేయొద్దని అన్నారు. బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో భట్టి ఈ ఆదేశాలిచ్చారు. ఈసందర్భంగానే తలసరి ఆదాయం విషయంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా ఉందని చెప్పారు. వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో కూడా ప్రథమ స్థానంలో తెలంగాణ ఉందని చెప్పారు. కర్ణాటక, హర్యానాను అధిగమించి తొలి స్థానం అందుకున్న తెలంగాణ రికార్డ్ సాధించిందని తెలిపారు.

‘‘వార్షిక రుణ ప్రణాళికలో మొదటి త్రైమాసికంలోనే తెలంగాణ 33.64 శాతం సాధించింది. వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు ఇవ్వండి ఆస్తుల తాకట్టు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల పేరుతో రైతులపై ఒత్తిడి తీసుకురావొద్దు. ఇందిరమ్మ ఇళ్లకు, స్వయం ఉపాధి పథకాలకు రుణాలు ఇవ్వాలి. వ్యవసాయ రంగాన్ని ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా భావిస్తున్నాం. అన్నదాతల పక్షాన రుణమాఫీ, రైతుభరోసా పేరిట బ్యాంకులకు రుణాలు జమ చేశాం. రూ.30 వేల కోట్లు రైతుల పక్షాన బ్యాంకులకు రాష్ట్రప్రభుత్వం జమ చేసింది. బ్యాంకింగ్‌ రికవరీ చరిత్రలో ఇది ఒక రికార్డు’’ అని భట్టి వెల్లడించారు.

Tags:    

Similar News