బస్రత్ ఖాన్ ఇంట్లో, కార్యాలయాల్లో ఈడీ సోదాలు

బడా రాజకీయనాయకులు, వ్యాపారవేత్తలకు లగ్జరీ కార్లు అమ్మినట్టు వెల్లడి

Update: 2025-09-26 14:17 GMT

హైదరాబాద్ లో లగ్జరీ కార్ల విక్రయాల డీలర్‌ బసరత్‌ ఖాన్‌ ఇల్లు, కార్యాలయంతో పాటు అతని స్నేహితుల ఇళ్లలో ఈడీ సోదాలు జరిగాయి. ఉదయం నుంచి ప్రారంభమైన సోదాలు సాయంత్రం వరకు కొనసాగాయి. ఫెమా ఉల్లంఘన కేసులో బసరత్‌ ఖాన్‌ ఇప్పటికే అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌ ఈడీ అధికారులు అరెస్టు చేయడం అప్పట్లో సంచలనమైంది. బడా బడా రాజకీయ నాయకులు, వ్యాపారులకు ఆయన లగ్జరీ కార్లు అమ్మినట్టు ఈడీ విచారణలో వెల్లడైంది. విదేశాల నుంచి తెచ్చిన కార్లకు పన్ను ఎగవేసిన ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ సోదాలు చేపట్టింది. బసరత్‌ ఖాన్‌ ఎవరెవరికి కార్లు విక్రయించారనే దానిపై కూడా ఈడీ అధికారులు లోతుగా ఆరా తీశారు. కోట్లాది రూపాయల కస్టమ్స్‌ మోసం కేసులో గతంలోనూ బసరత్‌ ఖాన్‌ అరెస్టయ్యారు.

ఈడీ దర్యాప్తు మంచి పరిణామం

కార్ల అక్రమ దిగుమతులపై ఈడీ దర్యాప్తు నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈడీ దర్యాప్తును మంచి పరిణామమని బండి సంజయ్ తెలిపారు. దేశ ఖజానాకు గండి కొడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.లగ్జరీ కార్ల విక్రేతలతోపాటు కొనుగోలుదారులపైనా విచారణ జరపాలన్నారు.

లగ్జరీ కార్ల కుంభకోణంలో అరెస్ట్ అయిన బస్రత్ ఖాన్ పై ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. లగ్జరీ కార్లను విక్రయించి వంద కోట్ల స్కాం చేసినట్టు బస్ రత్ ఖాన్ పై ఆరోపణలున్నాయి. కస్టమ్స్ ఫ్రాడ్ కేసులో అతను నిందితుడు. లగ్జరీ కార్లను సగం ధరకే దిగుమతి చేసుకుని విక్రయాలు చేస్తున్నట్టు డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ డివిజనల్ అధికారులు గుర్తించి అరెస్ట్ చేయడంతో ఈడీ అప్రమత్తమైంది.

లగ్జరీ కార్లను కొనుగోలు చేసిన వారిలో మాజీ మంత్రి కెటిఆర్ ఉన్నట్టు కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కెటిఆర్ లగ్జరీ కార్లను వాడిన ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ ఆరోపణలను కెటిఆర్ ఖండించలేదు. బస్రత్ ఖాన్ నుంచి లగ్జరీ కార్లను కొనుగోలు చేసిన కేసులో దర్యాప్తు చేసుకోవాలని కెటిఆర్ సవాల్ చేశారు.

Tags:    

Similar News