‘మాతృభాషలోనే బోధన కరెక్ట్ కాదు’.. విద్య కమిషన్ ఛైర్మన్
తెలంగాణ విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.;
తెలంగాణ విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో మాతృభాషలో బోధన, తప్పకుండా మాతృ భాష సబ్జెక్ట్‌ను కలిగి ఉండాలన్న అంశాలు ఉన్నాయి. తాజాగా వీటిపై విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళీ ఘాటుగా స్పందించారు. ప్రైవేటు విద్యా సంస్థలను ప్రభుత్వం నియంత్రిస్తోందని అన్నారు. విద్యా వ్యవస్థలో మార్పులు రావాలని కానీ అవి ఎలా పడితే అలా రాకూడదని అన్నారు. అంతేకాకుండా విద్యాసంస్థల్లో పెరుగుతున్న ఫీజుల గురించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఏడాది స్కూలు ఫీజు పెంచుతామంటూ సరైన పద్దతి కాదని, ఇయర్లీ ఇంక్రిమెంట్ చేయడాన్ని విద్యా సంస్థలు మానుకుంటే మంచిదంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వం తప్పకుండా ఒక చట్టం తీసుకురావాలని, ఈ విషయాన్ని ప్రభుత్వానికి తాము సిఫార్సు చేస్తున్నామని తెలిపారు. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండాలని, దాని ఏర్పాటుపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.
‘‘ప్రైవేటు విద్యా సంస్థలను స్ట్రీమ్ లైన్ చేయాలని సీఎం రేవంత్ కృతనిశ్చయంతో ఉన్నారు. ప్రైవేట్ పాఠశాలలు అసంబద్ధంగా ఫీజులు వసూలు చేుస్తున్నాయి. ఒక స్కూల్లో అప్రికేషన్ ఫీజే రూ.4,500 ఉంది. స్కూళ్లనేవి సేట్స్ యాక్టివిటీ నుంచి పూర్తిగా బయటకు రావాలి. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది. ప్రతి ఏడాది పాఠశాల ఫీజు పెంచుతామనడం సరైన పద్దతి కాదు’’ అని మురళీ అన్నారు. కాగా ప్రస్తుతం విద్యా అనేది పక్కా వ్యాపారం తరహాలో మారిపోయిందని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యను వ్యాపార రంగం నుంచి బయటకు తీసుకురావాలని, ఆ బాధ్యత ప్రభుత్వంపై ఉందని వివరించారు. అదే విధంగా విద్యార్థులకు మాతృభాషలోనే విద్యాబోధన చేయాలనడం కూడా సరికాదని చెప్పుకొచ్చారు.