మహబూబ్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం

ఆగి ఉన్నలారీని బస్సు ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు ప్రయాణికులు దుర్మరణం;

Update: 2025-08-15 11:42 GMT

మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. 44వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రమాదం సంభవించింది. జడ్చర్ల మాచారం ప్లై ఓవర్ బ్రిడ్జిపై ఆగి ఉన్న లారీని ప్రయివేట్ ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. బస్సు డ్రైవర్ బ్రేకులు వేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వేగంగా రావడం వల్లే బస్సు డ్రైవర్ బస్సును అదుపులో తేలేకపోయాడు. డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు మహిళలు స్పాట్ లో నే చనిపోయారు.  హైదరాద్ కూకట్ పల్లికి చెందిన అత్తా కోడళ్లు ప్రమాదంలో మృతి చెందారు. కడపలో పెళ్లి వేడుకలో పాల్గొని వస్తుండగా ప్రమాదం సంభవించింది.  ప్రయాణం చేస్తున్న 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉంది.

ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణిస్తున్నారు. వేగం ఎక్కువగా ఉండటంతో బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జయ్యింది.

అతివేగం ప్రధాన కారణం

రోడ్డు ప్రమాదాలకు అతివేగం ఒక ప్రధాన కారణం అని నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఇటీవలె వెల్లడించింది. అధిక వేగం వల్ల ప్రమాదాలను నివారించడం డ్రైవర్ వల్ల కాదు అని కౌన్సిల్ తేల్చింది. ఎందుకంటే వాహనం ఆపే దూరం తక్కువగా ఉండటంతో ప్రమాదం సంభవించి తీరుతుందని కౌన్సిల్ పేర్కొంది

2023లో జరిగిన మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 29% అతివేగం కారణంగానే వాటిల్లాయి అని కౌన్సిల్ పేర్కొంది. దీని వలన 11,775 మంది మృత్యువాత పడ్డారు. సగటున ప్రతీరోజు 32 మందికి పైగా మరణించారు.

Tags:    

Similar News