సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం..

దగ్దమైన ఆరు దుకాణాలు.

Update: 2025-10-04 09:11 GMT

సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. లోతుకుంట ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఓ సైకిల్ దుకానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు కూడా వ్యాపించాయి. దీంతో ప్రమాద తీవ్రత పెరిగింది. వెంటనే స్తానికులు అగ్నిమాక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందడంతోనే ఆగమేఘాలపై అక్కడకు చేరుకున్న అగ్రిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఆరు దుకాణాలు దగ్దమయ్యాయి. దీంతో ప్రాణ నష్టం ఏం జరగలేదు కానీ.. ఆస్తి నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆస్తి నష్టం ఎంత అయింది అనేది అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News