Fly Over | ఆరాంఘర్- జూపార్క్ ఫ్లైఓవర్ రేపు ప్రారంభం

ఆరాంఘర్ నుంచి జూపార్కు వరకు ఆరు వరుసల ఫ్లైఓవర్ ను రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.రూ.736 కోట్ల తో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధం చేశారు.;

Update: 2025-01-05 13:28 GMT

ఆరాంఘర్ నుంచి జూపార్కు వరకు ఆరు వరుసల ఫ్లైఓవర్ ను సోమవారం ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.రూ.736 కోట్ల తో 4.04 కిలోమీటర్ల దూరం నిర్మించిన ఆరు లైన్ల ఫ్లైఓవర్ ప్రారంభానికి జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధం చేశారు.దశాబ్దాలుగా పాత నగరంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యలకు ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంతో పరిష్కారమార్గం లభించినట్లయింది. ఈ ఫ్లై ఓవర్ పాతనగరానికి మణిహారంగా నిలిచింది.

- ఆరాంఘర్ నుంచి శాస్త్రిపురం, కాలాపత్తర్, దారుల్ ఉలూం, శివరాంపల్లి, హాసన్ నగర్ ఆరు జంక్షన్లను కలుపుతూ ఆరాంఘర్ నుంచి నెహ్రూ జూలాజికల్ పార్కు వరకు ఫ్లై ఓవర్ నిర్మించారు.



  - 4000మీటర్ల పొడవుతో వయాడక్ట్ భాగం పొడవు 3,720 మీటర్లతో 280 మీటర్ల ర్యాంప్ ల పొడవుతో ఆరు లైన్ల ఫ్లైఓవర్ నిర్మించారు.

- ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం వల్ల ఆరాంఘర్ నుంచి జూపార్కు వరకు ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం కానున్నాయి. ఆరు లైన్ల ఫ్లై ఓవర్ నిర్మాణం వల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది. ట్రాఫిక్ క్రమబద్ధీకరించడానికి ఇది సహాయపడుతుంది.


గ్రేటర్ హైదరాబాద్ లో రవాణా వ్యవస్థను మెరుగు పరిచేందుకు ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన  ఫ్లైఓవర్లు ఒక్కొక్కటీ అందుబాటులోకి వస్తున్నాయి. ఎస్.ఆర్.డి.పి ద్వారా 42 పనుల్లో ఇప్పటి వరకు 36 పనులు పూర్తయ్యాయి. జూపార్కు నుంచి ఆరాంఘర్ వరకు చేపట్టిన ఆరు లేన్ల అతిపెద్ద ఫ్లైఓవర్ గా అందుబాటులోకి రానున్నది.నగరంలో పీవీ నరసింహారావు ఫ్లైఓవర్ తర్వాత రెండో ఫ్లై ఓవర్ గా నిలుస్తుంది. 

సికింద్రాబాద్, వరంగల్ ఉమ్మడి జిల్లా, హుజురాబాద్, భువనగిరి, మేడ్చల్, మల్కాజ్ గిరి వాసులు శంషాబాద్ విమానాశ్రయానికి, అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు సిగ్నల్ ఫ్రీ రవాణాకు వెసులుబాటు ఉంది.ఈ నేపథ్యంలోనే ఆరాంఘర్ ఫ్లై ఓవర్ ప్రధాన ఫ్లై ఓవర్ ను ప్రారంభించడంతో వాహన దారులకు ఇబ్బందులు తొలగి పోనున్నాయి. ఈ ఫ్లైఓవర్ కు సంబంధించిన మిగతా పనులు ఇరువైపులా ర్యాంపులు, సర్వీస్ రోడ్డు వచ్చే మార్చి వరకు పూర్తి చేసేందుకు అవసరమైన మేరకు అన్ని చర్యలు తీసుకున్నారు.

 



Tags:    

Similar News