'సిబిఐకి అప్పగించినా, కేంద్రం అంగీకరిస్తేనే దర్యాప్తు
కాళేశ్వరం దర్యాప్తు మీద సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మినారాయణ కామెంట్;
-జి. రాం మోహన్
కాళేశ్వరం ప్రాజక్టులో జరిగిన అవినీతి ఆరోపణల మీద దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి తలుపులు తెరిచింది. దీనితో దర్యాప్తు చేసేందుకు రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు సిబిఐకి స్వేచ్ఛ లభించింది. ఇది వరకు బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో కేసులను విచారించేందుకు సిబిఐకి అనుమతి నిరాకరించింది.
ఈ కేసు దర్యాప్తు కోసం ఒక నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం జారీచేయటం తో దానికి కేంద్ర ప్రభుత్వం తన ఆమోదం తెలిపింది. సిబిఐ కి రాష్ట్రం లో సాధారణ అనుమతి నిరాకరిస్తూ బిఆర్ఎస్ ప్రభుత్వం 8 ఆగస్టు 2022 న నిర్ణయించిన విషయం తెలిసిందే.
జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ లో ప్రవేశ పెట్టిన తర్వాత కాళేశ్వరం కేసును సీబీఐ కి అప్పగిస్తామని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ ల నిర్మాణం లో జరిని అవినీతి ఆరోపణల మీద, దానికి కారకులయిన వారి మీద దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సిబిఐిని కోెరింది. ఈ కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీచేసింది. దీని తో ఇప్పుడు ఇందులో భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులు, కంపెనీ ల పైన దర్యాప్తు మొదలవుతుంది.
సిబిసి కి కేసులను ఎలా బదలాయిస్తారు?
సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద ఉన్న ఆరోపణలు సీబీఐ పరిధిలోకి రావు. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని కేసును సీబీఐ కి బదలాయించాలనుకుంటున్నటు ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ (డీఎస్పీ) సెక్షన్ 6 క్రింద ఒక నోటీస్ జారీ చేసి కేంద్రానికి పంపాలి. సిబిఐ ఢిల్లీ చట్టం క్రింద ఏర్పాటు చేసినందున ఈ అనుమతి తప్పనిసరి.
డీఎస్పీ చట్టం సెక్షన్ 5 క్రింద కేంద్రం ఆమోదం తెలిపిన తదుపరి మాత్రమే కేసు బదలాయింపుకి జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కేసు ను బదలాయిస్తూ 1 సెప్టెంబర్, 2025 వ తేదీన ఉత్తర్వులు( జీఓ నం 104) జారీ చేసింది.
ఇది వరకే ఈ బ్యారేజ్ లను చూసిన నేషన్ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA) మేడిగడ్డ బ్యారేజి కూలడానికి ప్లానింగ్, డిజైన్, ప్రమాణాల లోపంతో అని నిర్ధారించింది. ఈ రిపోర్ట్ ను జారీ చేసిన తరువాతే తెలంగాణ ప్రభుత్వం మాజీ సుప్రీమ్ కోర్టు జడ్జి పినాకి చంద్ర ఘోష్ ఆధ్వర్యం లో విచారణ కమిషన్ వేసిన నియమించింది. ఈ కమిషన్ , 2025 జూలై 7న తన రిపోర్ట్ ను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. అనంతరం రాష్ట్ర కేబినెట్ దానిని ఆగస్టు 4న దానిని అమోదం తలిపింది. అపైన అసెంబ్లీ లో ప్రవేశ పెట్టింది.
ఈ రిపోర్ట్ పై అసెంబ్లీ లో జరిగిన చర్చ తరువాత సిబిఐ కు అప్పగిస్తూ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు.
ఈ విషయం మీద మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ స్పందిస్తూ కేవలం రాష్ట్ర ప్రభుత్వం సెక్షన్ 6 క్రింద నోటిఫికేషన్ ఇస్తే సరిపోదు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలని అన్నారు. "రాష్ట్ర ప్రభుత్వాలు పొలిటికల్ గా తమకు ఇబ్బంది కరమైన కేసులను సిబిఐ కి అప్పగిస్తుంటాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్ ను కేంద్రం ఆమోదించాలని లేదు. ఉదాహరణకు ఏపీ లో సుగాలీ ప్రీతి కేసు తీసుకుంటే అది రాష్ట్రం లో జరిగిన క్రైమ్, చేసిన వాళ్ళు ఆ రాష్ట్రం లో ఉన్న వాళ్ళు. సెక్షన్ 6 కింద నోటిఫికేషన్ ఏపీ జారీచేసినా కేంద్రం సెక్షన్ 5 నోటిఫికేటి ఇష్యూ చేయలేదు. దాని వలన సీబీఐ ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేపట్టలేదు,"అని అన్నారు.
"రాష్ట్రం లో కూడా అవినీతి కేసుల దర్యాప్తుకు అవినీతి నిరోధక శాఖ ఉంది. జరిగిన అవినీతి అంతా పేపర్ల లో ఉంది. అవినీతి చేసింది రాష్ట్ర ప్రభుత్వ పరిధి లో ఉండేవాళ్ళు. అందువల్ల సరియైన కారణం లేకుండా సిబిఐ కి అప్పగిస్తే రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి విశ్వసనీయత పోతుంది," ఆయన వ్యాఖ్యానించారు.