బెంగుళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి
కంటైనర్ లారీని ఢీ కొట్టిన ప్రయివేటు ట్రావెల్ బస్సు;
మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున బెంగుళూరు జాతీయ రహదారి వద్ద అడ్డాకుల మండలం కాటావరం స్టేజి సమీపంలో వెళ్తున్న కంటెయినర్ లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. బస్సు హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.చనిపోయిన వారిని పోలీసులు గుర్తించారు. బస్సు క్లీనర్ హసన్ (35), అష్రఫున్నీసా(70), ఎల్లమ్మ(40)తో బాటు మరొకరు ఉన్నారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 31 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అడ్డాకుల పోలీసులు తెలిపారు.