గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద ఘటన విచారణకు ప్రత్యేక కమిటీ

ఘటనకు గల కారణాలు, ఘటన అనంతరం వివిధ శాఖలు తీసుకున్న చర్యలు పై సీఎం రేవంత్‌కు సమగ్ర నివేదిక అందించాలి.;

Update: 2025-05-20 06:53 GMT

పాతబస్తీలోని గుల్జర్ హౌస్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు ఇంకా ప్రాణాల కోసం పోరాడుతున్నారు. వారికి పలు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు అధికారులు. ఈ క్రమంలోనే అసలు అగ్నిప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి అన్న అంశంపై అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును హ్యాండిల్ చేయడం కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆరుగురు అధికారులతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని హైదరాబాద్ ఇన్‌ఛార్జ్, మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ కమిటీలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌, టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌ ఉన్నారు.

ఈనెల 18 న జరిగిన గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాదంపై క్షేత్ర స్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి ఘటనకు గల కారణాలు, ఘటన అనంతరం వివిధ శాఖలు తీసుకున్న చర్యలు పై సీఎం రేవంత్‌కు సమగ్ర నివేదిక అందించాలి. అదే విధంగా అలాగే భవిష్యత్ లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా క్షేత్రస్థాయి ప్రజలకు సూచనలు స్థానిక పరిస్థితులు అంచనా వేసి భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగు ప్రతిపాదనలతో సూచనలు చేస్తూ ప్రతిపాదనలు చేయాలి. కమిటీ నివేదిక సమర్పించిన సీఎం, డిప్యూటీ సీఎం, ఉన్నతాధికారులు దీనిపై సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత వెంటనే చర్యలు చేపడతారు.

Tags:    

Similar News