గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు: రేవంత్

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేడు తన 71వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.;

Update: 2025-02-17 07:33 GMT

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేడు తన 71వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకున్న రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా సంబరాలు చేస్తున్నాయి. ఈ సందర్బంగానే కేసీఆర్‌కు శుభాకాంక్షల వెల్లువెత్తుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు కూడా కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావు భావోద్వేగ పోస్ట్ పెట్టారు. కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదన్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశవిదేశాల్లో కూడా కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్, అడిలైడ్, బ్రిస్బెన్ నగరాల్లో బీఆర్ఎస్ ఆస్త్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

రేవంత్ శుభాకాంక్షలు

గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

 

మేనమామకు పుట్టినరోజు శుభాకాంక్షలు: హరీష్

‘‘కేసీఆర్ తెలంగాణ ఉద్వేగం

కేసీఆర్ తెలంగాణ ఉద్రేకం

కేసీఆర్ తెలంగాణ స్వాభిమానం

కేసీఆర్ జై తెలంగాణ యుద్ధ నినాదం

కేసీఆర్ తెలంగాణ సమున్నత అస్తిత్వం

కేసీఆర్ తెలంగాణ ప్రజా ఉద్యమ పటుత్వం

కేసీఆర్ తెలంగాణ ఆవేశాల అగ్నితత్వం

కేసీఆర్ తెలంగాణ అనురాగాల అమృతత్వం

కేసీఆర్ తెలంగాణ ప్రజాగళం

కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవ రణం

కేసీఆర్ తెలంగాణ నూతన రాష్ట్ర ఆవిష్కరణం

కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభ్యుదయం

కేసీఆర్ తెలంగాణ జనం గుండెల్లో నిత్య సూర్యోదయం

మీరు నా తలనిమిరే తల్లిప్రేమ

నాకు ఎనలేని మమకారం పంచిన మేనమామ

నాకు రాజకీయ చైతన్యాన్ని నేర్పించి

నాలో ప్రజా సేవా సంస్కారాన్ని రంగరించి

నన్ను ఉద్యమ కార్యాచరణలో నడిపించి

నాలోని నాయకత్వ గుణాన్ని ప్రేరేపించి

నాకు పరిపాలనా సామర్థ్యాన్ని కల్పించి

నన్ను చరితార్థుణ్ణి చేసిన మీరు

శత వసంతాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’’ అని హరీష్ రావు పేర్కొన్నారు.

 

Tags:    

Similar News