కేసీయార్ ట్రాపులో ఇరుక్కున్నారా ?

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత హరీష్ రావు వేసిన ట్రాప్ లో కేసీయార్ ఇరుక్కుని విలవిల్లాడుతున్నట్లు రేవంత్ చెప్పారు.

Update: 2024-06-28 06:11 GMT
KCR and Harish Rao

వినటానికే విచిత్రంగా ఉన్న చెప్పింది మాత్రం రేవంత్ రెడ్డే. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత హరీష్ రావు వేసిన ట్రాప్ లో కేసీయార్ ఇరుక్కుని విలవిల్లాడుతున్నట్లు రేవంత్ చెప్పారు. మీడియాతో రేవంత్ మాట్లాడుతు కేసీయార్ బతికున్నంతవరకు హరీష్ ఆయన్ను ఏమీ చేయలేరన్నారు. కేసీయర్ పూర్తిగా బలహీనమయ్యాక మొత్తంపార్టీని హరీష్ తన చేతిలోకి తీసేసుకుంటారని రేవంత్ జోస్యం చెప్పారు. ఒకవేళ పార్టీని తనచేతిలోకి తీసుకోవటం సాధ్యంకాకపోతే అప్పుడు హరీష్ అందుబాటులోని మార్గం వెతుక్కుంటారని చెప్పారు.


రేవంత్ తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయనే చెప్పాలి. కేసీయార్-హరీష్ మధ్య సత్పబంధాలున్నట్లు కనబడుతున్నా లోలోపల ఏమంత సవ్యంగా లేవనే ప్రచారం పార్టీలోనే ఎప్పటినుండో జరుగుతోంది. చాలాసార్లు హరీష్ ను కేసీయార్ దూరంగా పెట్టినట్లు పార్టీలోనే చర్చలు జరుగుతున్నాయి. అవసరమైనపుడు మాత్రమే కొడుకు కేటీయార్ కు బదులు హరీష్ ను కేసీయార్ ఉపయోగించుకుంటున్నారట. ఇదే సమయంలో కేటీయార్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఇవ్వటం కూడా హరీష్ కు ఏమాత్రం ఇష్టంలేదనే ప్రచారం బాగా జరిగింది. ప్రాంతీయపార్టీలంటే అచ్చంగా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీల్లాంటివే అన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి టీఆర్ఎస్ అయిన బీఆర్ఎస్ అయినా కర్త, కర్మ, క్రియా అంతా కేసీయారే కాబట్టి పార్టీ కల్వకుంట్ల వారి సొంతమనటంలో సందేహంలేదు.

ఈ విషయం నచ్చినవాళ్ళు పార్టీలో ఉంటారు నచ్చని వాళ్ళు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారంతే. కేసీయార్ ఆలోచనలు నచ్చి పార్టీలో ఉండేవాళ్ళు కేసీయార్ తో పాటు కేటీయార్ నాయకత్వాన్ని కూడా ఆమోదించాల్సిందే తప్ప వేరేదారిలేదు. ఇక్కడే పార్టీలో కేటీయార్ గ్రూపు, హరీష్ గ్రూపులు ఏర్పడినట్లు పార్టీలోనే టాక్ నడుస్తోంది. సరే, ఏ పార్టీలో అయినా ఒకటికి మించి పవర్ సెంటర్లుండటం చాలా సహజమే కదా. అదే పద్దతి బీఆర్ఎస్ లో కూడా ఉంది. కాకపోతే కేసీయార్ ను హరీష్ ట్రాపు చేశారని, కేసీయార్ బలహీనం కాగానే పార్టీని హరీష్ తీసేసుకుంటాడని రేవంత్ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. పార్టీని హరీష్ చేతిలోకి తీసేసుకుంటే మరి కేటీయార్ చూస్తూ ఊరుకోరు కదా. అప్పుడు కేటీయార్ ఏమిచేస్తారని రేవంత్ అనుకుంటున్నారో అర్ధంకావటంలేదు.

కేసీయార్ బాధపడుతున్నారా ?

కేసీయార్ మానసికక్షోభతో బాధపడుతున్నట్లు రేవంత్ చెప్పటం భలేగా ఉంది. కేసీయార్ మానసికంగా బాధపడుతున్నట్లు రేవంత్ కు ఎలాగ తెలుసు ? ఎలాగంటే కేసీయార్ బాడీ ల్యాంగ్వేజ్ చూస్తే అర్ధమైపోతోందన్నారు. ఎలాగంటే ఓడిపోయిన తర్వాత ఎంఎల్ఏలు వస్తే కేసీయార్ లేచి దండంపెట్టి వాళ్ళని ఆహ్వానిస్తున్నారట. ఎంఎల్ఏలు రాగానే లేచి నిలబడి దండంపెట్టి ఆహ్వానించటం కేసీయార్ తత్వానికి పూర్తిగా విరుద్ధమన్నారు. కాని ఇప్పటి పరిస్ధితుల్లో ఎంఎల్ఏలను ఆహ్వానించక కేసీయార్ కు తప్పటంలేదట. జైలుకు వెళ్ళినా కేసీయార్ ఈ విధంగా బాధపడేవారు కాదని రేవంత్ ఎద్దేవా చేశారు.

రేవంత్ వ్యాఖ్యలు చూస్తుంటే కేసీయార్-హరీష్ మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లే ఉంది. అలాగే కేటీయార్-హరీష్ మధ్య కూడా గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లే ఉంది. లేకపోతే ఎంఎల్ఏలు వస్తే కేసీయార్ లేచి దండంపెట్టి రిసీవ్ చేసుకోవటానికి తెగ బాధపడిపోతున్నట్లు రేవంత్ కామెంట్ చేయటమే విచిత్రంగా ఉంది. అందుకనే కేసీయార్ బాడీ ల్యాంగ్వేజ్ ని బట్టి తాను అంచనా వేసినట్లు రేవంత్ చెప్పారు.

Tags:    

Similar News