హెచ్ సీ ఏ నిందితుల సీన్ రీ కన్ స్ట్రక్షన్

ఉప్పల్ స్టేడియంలో సిఐడి సోదాలు;

Update: 2025-07-18 12:54 GMT

హెచ్‌సీఏ స్కామ్(HCA) కేసులో సీఐడీ (CID) స్పీడ్ పెంచింది. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో సీఐడీ సోదాలు నిర్వహించింది. హెచ్‌సీఏ అక్రమాల కేసులో నిందితుల సీన్ రీకన్‌స్ట్రక్షన్ జరిగింది. సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం ప్రధాన నిందితుడైన జగన్ మోహన్ రావును సి ఐడి అధికారులు ఉప్పల్ స్టేడియానికి తీసుకెళ్లారు. ఉప్పల్ స్టేడియంలోని హెచ్‌సీఏ కార్యాలయంలో అధికారులు సోదాలు చేశారు. అనంతరం ఉప్పల్ స్టేడియం నుంచి శ్రీచక్ర క్లబ్‌కు నిందితులను తరలించారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావుతోపాటు ట్రెజరర్ శ్రీనివాస్ రావు, సీఈవో సునీల్ కాంటే, శ్రీ చక్ర క్లబ్ ప్రెసిడెంట్ కవిత, క్లబ్ జనరల్ సెక్రెటరీ రాజేంద్ర యాదవ్‌లతో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయించారు. గౌలిపురా స్టేడియంలో ఉన్న మిత్ర క్లబ్ అధ్యక్షుడైన కృష్ణాయాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేయడం వల్ల జగన్ మోహన్ రావు హెచ్ సిఎ అధ్యక్షుడయ్యారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో కెటిఆర్, కవితల సహకారంతో జగన్ మోహన్ రావు అధ్యక్షుడైనట్లు ఆరోపణలున్నాయి.

Tags:    

Similar News