చనిపోతూ ఐదుగురిని బతికించాడు

రమణ ఐదుగురికి ప్రాణదానం చేసినట్లే అని తెలిసిన వారు అభినందిస్తున్నారు.;

Update: 2025-05-03 13:37 GMT
Organ Donator

జీవన్ మృతుడు అనే పదం పాతసినిమాల్లో ఎక్కువగా ఉంటుంటాం. జీవన్ మృతుడు అంటే చనిపోయి కూడా బతికుండే వాడు అనర్ధం. దీనికి రెండు అర్ధాలుంటాయి. మొదటిదేమో మనిషి చనిపోయినా అయినవాళ్ళ జ్ఞాపకాల్లో సజీవంగా ఉండేవాడని. ఇక రెండో అర్ధం ఏమిటంటే తాను చనిపోతు అవయవదానం చేసి ప్రాణాపాయంలో ఉన్న వారికి కొత్తజన్మ ప్రసాదించటం. ఇపుడు ఇదంతా ఎందుకంటే రమణ అనే 20 ఏళ్ళ యువకుడు తాను చనిపోతు ఐదుగురికి ప్రాణదానం చేశాడు. విషయం ఏమిటంటే ఈమధ్యనే వివాహం అయిన బానోతు రమణది వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మండలంలోని నీలగిరిస్వామి తండ.

ఏప్రిల్ నెల 27వ తేదీన మొటారుసైకిల్ మీద వస్తుంటే ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ బలంగా ఢీకొన్నది. తీవ్రగాయాలైన రమణను కొందరు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స తీసుకుంటు మే 1వ తేదీన బ్రైన్ డెడ్ అవటంతో రమణ మరణించాడు. దాంతో రమణ భార్య కల్యాణి తన భర్త అవయవాలను ప్రాణాపాయంలో ఉన్నవారికి దానంచేయాలని(Organ Donations) డిసైడ్ అయ్యింది. అదే విషయాన్ని డాక్టర్లకు చెప్పగా రెండు కిడ్నీలు, లివర్, గుండె, కార్నియాలను తీసుకున్నారు. ప్రతిరోజు ఎంతోమంది రోడ్డుప్రమాదాల్లోను, దీర్ఘవ్యాధులతోను ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికి గుండె, కిడ్నీలు, లివర్ ను దానంచేయటం ద్వారా రమణ ఐదుగురికి ప్రాణదానం చేసినట్లే అని తెలిసిన వారు అభినందిస్తున్నారు.

Tags:    

Similar News