హైదరాబాద్ నగరంలో కుక్కపిల్లల దత్తతకు డ్రైవ్

వీధి కుక్కల బెడదను నివారించేందుకు జీహెచ్ఎంసీ కుక్కపిల్లల దత్తత కార్యక్రమాన్ని ప్రారంభించింది.;

Update: 2025-08-31 01:43 GMT
కుక్క పిల్లను దత్తత ఇస్తున్న జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీకర్ణన్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ ) ఆధ్వర్యంలో ఆదివారం ఇండీ పప్పీ దత్తత డ్రైవ్ చేపట్టింది. ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు బంజారాహిల్స్ లోని కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్కులో రెండవ విడత కుక్కపిల్లల దత్తత కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్యంగా ఉన్న టీకాలు వేసిన కుక్కపిల్లలను డాగ్ లవర్స్ కు ఉచితంగా దత్తత ఇవ్వనున్నారు.




 కుక్క పిల్లలను దత్తత తీసుకోండి

షాపింగ్ చేయవద్దు, కుక్క పిల్లలను దత్తత తీసుకోండి అంటూ జీహెచ్ఎంసీ నగర పౌరులను ఆహ్వానించింది. వీధి కుక్కల సంరక్షణను ప్రోత్సహించేందుకు కుక్కపిల్లల దత్తత కార్యక్రమాన్ని చేపట్టామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ చెప్పారు. కుక్కపిల్లలను ఉచితంగా అందిస్తామని, కానీ ప్రేమ మాత్రం అవసరమని జీహెచ్ఎంసీ పేర్కొంది.

అనూహ్య స్పందన

గతంలో నగరంలోని జలగం వెంగళరావు పార్కులో కుక్క పిల్లల దత్తత కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ ప్రారంభించింది.కుక్క పిల్లలను దత్తత తీసుకునేవారు వాటిని కుటుంబంగా చూసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కోరారు. 39 ఆరోగ్యకరమైన కుక్కపిల్లల్లో 24 దత్తత ఇచ్చారు. ‘‘దత్తత తీసుకోండి, షాపింగ్ చేయవద్దు’’ అనే నినాదంతో ఇండీ పప్పీ దత్తత డ్రైవ్ చేపట్టింది. ఈ చొరవ భవిష్యత్తులో ఇండీ కుక్కలను దత్తత తీసుకునేలా మరింత మందిని ప్రేరేపిస్తుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు.హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల బెడదను నివారించేందుకు వీలుగా కుక్కపిల్లల దత్తత కార్యక్రమాన్ని చేపట్టినట్లు జీహెచ్ఎంసీ అధికారులు చెప్పారు.


Tags:    

Similar News