అసెంబ్లీలో నేడు కల్లోలం రేపనున్న కాళేశ్వరం నివేదిక

తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై ఆదివారం చర్చ జరగనుంది.;

Update: 2025-08-31 01:01 GMT
తెలంగాణ అసెంబ్లీ

తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఆదివారం 9 గంటలకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ సమర్పించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అడుగడుగునా అక్రమాలతోపాటు నాణ్యతకు తిలోదకాలు ఇచ్చినందున కాళేశ్వరం ప్రాజెక్టును ఆర్థిక విపత్తుగా కాంగ్రెస్ పార్టీ పరిగణిస్తోంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఈ నివేదిక కాక రేపనుంది.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ సభ్యులతోపాటు నీటిపారుదల శాఖ నిపుణుల సలహాలను విస్తరించారని జస్టిస్ పీసీ ఘోష్ తన నివేదికలో పేర్కొంది. రూ.1.1లక్షల కోట్లతో నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన లోపాలకు కేసీఆర్ కారణమని ఘోష్ నివేదిక పేర్కొన్న నేపథ్యంలో అసెంబ్లీలో దీనిపై వాడి వేడి వాదనలు జరగనున్నాయి.


కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్రప్రభుత్వం దీనిపై న్యాయవిచారణకు ఆదేశించింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి పీసీఘోష్ ను నియమించింది. జస్టిస్ పీసీ ఘోష్ విచారణ జరిపి జులై 31వతేదీన తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఈ నివేదికలో మేడిగడ్డ బ్యారేజీ వద్ద మునిగిన స్తంభాలు, నిర్మాణాల్లో పగుళ్లు కనిపించాయని నివేదిక తేటతెల్లం చేసింది. నీటిపారుదలరంగ నిపుణుల హెచ్చరికలను పట్టించుకోకుండా సురక్షిత సామర్ధ్యానికి మంిచి నీటిని నిల్వ చేశారని కమిషన్ నివేదికలో పేర్కొంది. ఈ బ్యారేజీ నిర్మాణలో అక్రమాలు, నాణ్యత లోపాలు ఉన్నాయని తెలిపింది.బలహీనమైన పునాదులపై ప్రాజెక్టును నిర్మించారని నివేదిక పేర్కొంది.

కాళేశ్వరంపై కాంగ్రెస్ గళం విప్పనుంది...
కాళేశ్వరం నివేదికపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తం కుమార్ రెడ్డి జలసౌథలో శిక్షణ ఇచ్చారు. కాళేశ్వరంలో వైఫల్యాలు, అక్రమాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గళం విప్పనున్నారు. గతంలో తన పదవీ కాలంలో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు విజయం గురించి గొప్పలు చెప్పుకున్నారని , కానీ ఇప్పుడు అక్రమాలు వెలుగుచూడటంతో కేసీఆర్ అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారని సమాచారం.

ఎన్నెన్నో వైఫల్యాలు
- కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత నియంత్రణ చర్యలు పాటించలేదని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికలో తేల్చి చెప్పింది. ప్రాజెక్టు ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే మరమ్మతులు, నిర్వహణలో గత సర్కారు జాప్యం చేసిందని తేల్చారు.
- కాళేశ్వరంలోని బ్యారేజీలకు ఆపరేషన్ అండ్ మెయిన్ టెనెన్స్ మాన్యువల్ లేకపోవడం, ఆనకట్ట భద్రతా చట్టం 2021 నిబంధనలను పాటించలేదని కమిషన్ వెల్లడించింది. ప్రాజెక్టు బ్యారేజీల్లో నిర్మాణ సమస్యలు, నిర్వహణ సవాళ్లు ప్రాజెక్టుకున దెబ్బతీశాయి.బ్యారేజీ నిర్మాణం పటిష్ఠంగా లేదని నివేదిక పేర్కొంది.
- వర్షాకాలానికి ముందు, తర్వాత బ్యారేజీలను తనిఖీలు చేయలేదని, ఆనకట్టల భద్రతా చట్టం 2021 ప్రకారం బ్యారేజీల నిర్వహణపై లాగ్ బుక్ లో నమోదు చేయలేదని తేలింది.
- 2019 సంవత్సరంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయిన తర్వాత కట్ ఆఫ్ వాల్ దిగువన ఉన్న సీసీ బ్లాక్ ల వద్ద భూమి నుంచి నీరు బయటకు వచ్చిందని నివేదిక వెల్లడించింది.
- అన్నారం ,సుందిల్ల బ్యారేజీల నిర్మాణం ఎలాంటి ముందస్తు జియోటెక్నికల్ పరిశోధనలు లేకుండా హై-పవర్డ్ కమిటీ నిర్ణయం తీసుకుందని తేలింది.
- కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో సరైన భౌగోళిక సాంకేతిక పరిశోధనలు చేయలేదని, డిజైన్ లోపాలున్నాయని, నిర్మాణ లోపాలున్నాయని నివేదిక వెల్లడించింది.


Tags:    

Similar News