ఓఎంసీ కేసులో శ్రీ లక్ష్మి రివ్యూ పిటిషన్ పై రేపు విచారణ
సిబిఐ వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్;
ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి దాఖలు చేసిన రివ్యూపిటిషన్ తెలంగాణ హైకోర్టు విచారించింది. సిబిఐ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ కపాడియా వాదనలు వినిపించారు. ఓఎంసీకి అక్రమంగా మైనింగ్ లీజు అప్పగించారని వాదనలు వినిపించారు. అక్రమార్కులకు శ్రీలక్ష్మి అండగా నిలిచారని , ఓఎంసీకి లీజు కేటాయించేలా శ్రీ లక్ష్మి చొరవ చూపారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు.‘‘ఆమె అక్రమాలకు పాల్పడ్డారని సిబిఐ కోర్టు తేల్చేసింది. అన్ని సాక్ష్యాధారాలను సిబిఐ సేకరించింది వీటిని పరిశీలించిన తర్వాతే సిబిఐ కోర్టు తీర్పు చెప్పింది’ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. శ్రీ లక్ష్మి రివిజన్ పిటిషన్ కొట్టివేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. వాదనలు విన్న హైకోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.