కేటీఆర్‌కు హైకోర్టు ఝలక్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది.;
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఫార్ములా ఈ-కార్ రేసు విషయంలో ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది. కాగా తనపై ఫైల్ చేసిన కేసును కొట్టేయాలని, తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ కేటీఆర్.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు తుదితీర్పు వెలువరించింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. దీంతో కేటీఆర్ ఎప్పుడైనా అరెస్ట్ కావొచ్చన్న ప్రచారం జోరందుకుంది. ఏసీబీ, ఈడీ విచారణతోనే కేటీఆరో కటకటాల పాలవ్వనున్నారంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈరోజు ఈడీ విచారణకు హాజరుకావాల్సిన కేటీఆర్ తనకు మరింత సమయం కావాలని కోరుతూ లేఖ రాశారు. అందుకు సానుకూలంగా స్పందించిన ఈడీ మళ్ళీ ఎప్పుడు విచారణకు రావాలన్నది అతి త్వరలో తెలుపుతామని వెల్లడించింది.
దీంతో పాటుగానే జనవరి 9న ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరుకావాల్సి ఉంది. వాస్తవానికి జనవరి 6న కేటీఆర్‌ను ఏసీబీ విచారించాల్సి ఉండగా.. తన లాయర్లను అనుమతించలేదన్న అంశంలో ఏసీబీ కార్యాలయం నుంచి కేటీఆర్ వెనుదిరిగారు. దీంతో అదే రోజు సాయంత్రం జనవరి 9న విచారణకు రావాలంటూ ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది.