కేటీఆర్‌పై వేలాడుతున్న ఈ-కార్ రేసు కత్తి..!
కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై తీర్పును ఉన్నత న్యాయస్థానం రిజర్వ్ చేసింది. తీర్పిచ్చే వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశాలూ జారీ చేసింది.;
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మెడపై ఫార్ములా ఈ-కార్ రేసు కత్తి వేలాడుతోంది. ఈ-కార్ రేసు సమయంలో ఎటువంటి అనుమతులు లేకుండా హెచ్‌ఎండీఏ ఓ విదేశీ సంస్థకు రూ.54 కోట్లు చెల్లించింది. ఈ లావాదేవీకి సంబంధించి ఇటీవల కేటీఆర్‌ను విచారించడానికి ఏసీబీ రంగంలోకి దింగింది. గవర్నర్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసింది. ఇంతలో ఈడీ కూడా బరిలోకి దిగి శరవేగంగా దర్యాప్తును కొనసాగిస్తున్న క్రమంలో కేటీఆర్.. హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని, తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కేటీఆర్ తన క్వాష్ పిటిషన్‌లో కోరారు. ఆ పిటిషన్‌పై విచారణ ప్రారంభించిన న్యాయస్థానం డిసెంబర్ 31 వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని, ఈ సమయంలో ఏసీబీ తన దర్యాప్తు కొనసాగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగుస్తుండగా మంగళవారం కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై ఉన్నతన్యాయస్థానంలో వాడివేడి విచారణ జరిగింది. ఇరు పక్షాల న్యాయవాదులు నువ్వానేనా అన్న తరహాలో వాదనలు వినిపించారు. వారి వాదనలు విన్న న్యాయస్థంన ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేసింది. అంతేకాకుండా ఈ కేసు తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని కూడా ఆదేశాలు జారీ చేసింది.
దీంతో కేటీఆర్ పరిస్థితి గందరగోళంగా తయారయింది. ఆయన అరెస్ట్ అవుతారా కారా అనేది రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారి తీస్తోంది. కోర్టు తీర్పు ఎలా ఉండనుందనేనిది కూడా హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం కోర్టు తీర్పు కేటీఆర్‌పై వేలాడుతున్న కత్తిలా మారింది. మీదపడుతుందో, కిందపడుతుందో అర్థం కాని పరిస్థితి. కాగా మరోవైపు దర్యాప్తు సంస్థలు తమ దర్యాప్తులో వేగం పెంచాయి. వాటి దర్యాప్తులో ఏమని తేలనుందనేది చూడాల్సి ఉంది.
ఒప్పందానికి ముందే చెల్లింపులు
ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో ఒప్పందాని కన్నా ముందే చెల్లింపులు జరిగాయని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. బ్రిటన్ పౌండ్ల రూపంలో రూ.46కోట్లు చెల్లించినట్లు చెప్పారు. రేసింగ్ సీజన్ 10 ఒప్పందానికి ముందే నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేశారని తెలిపారు. దర్యాప్తు ఏ దశలో ఉందని ఈ సందర్భంగా ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. కాగా విచారణ ప్రాథమిక దశలోనే ఉందని వివరించారు. అన్ని ఆధారాలు అతి త్వరలోనే బయటపడతాయని ఏజీ తెలిపారు. నిందితులు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి ఏమైనా పిటిషన్లు దాఖలు చేశారా అని న్యాయస్థానం న్యాయస్థానం అడగగా లేదని ఏజీ బదులిచ్చారు.