తెలంగాణలో కుల గణనపై ఇంటింటి సర్వే

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలు,ఎస్సీ, ఎస్టీలకు కుల గణనపై ఇంటింటి సర్వే చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జీఓ జారీ చేశారు.

Update: 2024-10-11 14:26 GMT

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుల గణనకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ, ఎస్సీ,ఎస్టీ వర్గాల కులాల వారీగా సామాజిక,ఆర్థిక,విద్య,ఉద్యోగ,రాజకీయ రంగాలపై సమగ్ర సర్వే చేయాలని రాష్ట్ర సర్కారు చీఫ్ సెక్రటరీ జీఓను జారీ చేశారు. ఈ కీలకమైన సర్వేను రెండు నెలల గడువుతో పూర్తి చేయాలని సర్కారు ఆదేశించింది.

- కుల గణనకు తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానం మేరకు ఈ ఇంటింటి సర్వేకు ప్రణాళిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 4వతేదీన రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం మేరకు రాష్ట్ర మంత్రివర్గం కుల గణనకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో సాధారణ పరిపాలన శాఖ నోట్ సమర్పించింది. దీనిపై చీఫ్ సెక్రటరీ శుక్రవారం జీఓఎంఎస్ నంబరు 18 తో ఉత్తర్వులు జారీ చేశారు.
- రాష్ట్ర ప్రణాళిక శాఖ ఈ ఇంటింటి సర్వేను అరవై రోజుల్లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ జీఓ విడుదలపై పలు బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News