KTR body language|కేటీఆర్ లో ఎంత తేడా వచ్చింది ?
తాజాగా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ)(ED Inquiry) విచారణకు హాజరైన తర్వాత కేటీఆర్(KTR) మీడియాతో విచారణ తీరుపై చాలాజాగ్రత్తగా మాట్లాడారు.;
ఇంతలోనే కేటీఆర్ లో ఎంతమార్పు వచ్చేసిందో. రెండు దర్యాప్తుసంస్ధల విచారణ విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వైఖరి పూర్తిగా మారిపోయింది. తాజాగా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ)(ED Inquiry) విచారణకు హాజరైన తర్వాత కేటీఆర్(KTR) మీడియాతో విచారణ తీరుపై చాలాజాగ్రత్తగా మాట్లాడారు. అదే ఆమధ్య ఏసీబీ(ACB) విచారణకు హాజరైన తర్వాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్ చాలా హేళనగా మాట్లాడిన విషయం గుర్తుండే ఉంటుంది. పైగా విచారణలో ఏసీబీ అధికారులనే ఉల్టాగా ప్రశ్నలతో ఇబ్బందులు పెట్టినట్లు ప్రచారం జరగటం అందరికీ తెలిసిందే. ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్ విచారణలో భాగంగా విచారణ అధికారులనే ఎదురుప్రశ్నలతో బాగా ఇబ్బందిపెట్టినట్లుగా బీఆర్ఎస్(BRS) మద్దతు మీడియా, సోషల్ మీడియా బాగా ప్రచారం చేసింది. విచారణ తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడినపుడు కూడా అదే వైఖరితో మాట్లాడారు. మరిపుడు ఈడీ విచారణలో ఆ వైఖరి కనబడలేదు, ఏమైంది ? ఎందుకింత లోప్రొఫైల్ మైన్ టైన్ చేస్తున్నట్లు ?
ఇక్కడే విచారణలో అధికారులు కేటీఆర్ ను ఉక్కిరిబిక్కిరిచేసినట్లు అర్ధమవుతోంది. ఫార్ములా ఈ కార్ రేసు(Formula E car case)లో అవినీతిని పక్కనపెట్టేస్తే నిధుల బదిలీలో నిబంధనల ఉల్లంఘన, అధికారదుర్వినియోగం అన్నది స్పష్టంగా బయటపడిందని కోర్టు నమ్మింది. అందుకనే ఈ విషయాలపైనే ఈడీ అధికారులు ఎక్కువగా ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. పనిలోపనిగా మనీల్యాండరింగ్(Money Laundering), ఫెమా(FEMA) నిబందనల ఉల్లంఘన గురించి కూడా కేటీఆర్ ను ప్రశ్నలపై ప్రశ్నలు గుప్పించినట్లు సమాచారం. దాంతో చాలాప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయారని, మరికొన్ని ప్రశ్నలకు అధికారులే బాధ్యులని సమాధానం చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఒకపుడు ఫార్ములా కార్ రేసు వ్యవహారాలన్నింటికీ తానే పూర్తి బాధ్యుడనని ప్రకటించిన కేటీఆర్ ఇపుడు మాత్రం నిబంధనల ఉల్లంఘన, ప్రొసీజరల్ ల్యాప్స్ అన్నింటికీ అధికారులదే బాధ్యతగా తోసేసినట్లు సమాచారం. గతంలో కమిట్ అయినట్లుగా ఈడీ విచారణలో నిదుల బదిలీకి తనదే బాధ్యతని కమిట్ అయితే అంతేసంగతులని బహుశా లాయర్లు హెచ్చరించుంటారు. అందుకనే తనకేమీ తెలీదని విచారణలో అడ్డంతిరిగినట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి. అయితే ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని విచారించిన ఈడీ అధికారులు కేటీఆర్ పాత్రపై అవసరమైన సాక్ష్యాధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. అందుకనే కేటీఆర్ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నప్రశ్నలకు అంతకుముందు విచారణలో అర్వింద్, రెడ్డి సమాధానాలతో క్రాస్ చెక్ చేసుకున్నట్లు సమాచారం.
నిదుల బదిలీకి ఆర్ధికశాఖ అనుమతి తీసుకోకపోవటం, క్యాబినెట్ ఆమోదం లేకుండానే నిధుల బదిలీచేయాలనే నిర్ణయం తీసుకోవటం గురించి అడిగినపుడు కేటీఆర్ సరైన సమాధానాలు చెప్పలేదని తెలిసింది. విదేశీకంపెనీకి విదేశీకరెన్సీలో చెల్లింపులు చేసేముందు రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకున్నారా అన్న ప్రశ్నకు అదంతా అధికారులు చూసుకోవాల్సిన వ్యవహారాలని తప్పించుకునే ప్రయత్నంచేసినట్లు సమాచారం. నిధులబదిలీలో కేటీఆర్ ఆదేశాల ప్రకారమే తామునడుచుకున్నట్లుగా అధికారులు చెప్పారని చెప్పినపుడు కేటీఆర్ ఏమీ మాట్లాడలేదని తెలిసింది. అడిగిన ప్రశ్నలకు కాకుండా కొన్నిసార్లు తనిష్టంవచ్చినపుడు మాట్లాడటానికి కేటీఆర్ చేసిన ప్రయత్నాలను అధికారులు అడ్డుకున్నారు. అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పాలని మిగిలిన అంశాలగురించి మాట్లాడాల్సిన అవసరంలేదని కటువుగానే హెచ్చరించారు.
కేటీఆర్ భయపడ్డారా ?
విచారణ తర్వాత కేటీఆర్ బాడీల్యాంగ్వేజ్ చూసిన వాళ్ళకు అవుననే అనుమానం పెరిగిపోయింది. ఏసీబీ విచారణ నుండి బయటకు వచ్చిన కేటీఆర్ మీడియా ముందు దర్యాప్తుసంస్ధపై రెచ్చిపోయి కామెంట్లుచేసిన విషయం గుర్తుండే ఉంటుంది. రేవంత్ రాసిచ్చిన నాలుగు ప్రశ్నలనే ఏసీబీ అధికారులు 40 సార్లు తిప్పితిప్పి అడిగినట్లు కేటీఆర్ చాల హేళనగా చెప్పారు. ‘ఇదంతా లొట్టపీసు కేసు..దీనికి దర్యాప్తు కూడా దండగే’ అని ఎద్దేవాచేశారు. ఈడీ విచారణ ముగించుకుని బయటకువచ్చిన కేటీఆర్ పై విధమైన వ్యాఖ్యలు చేయలేదు. కాకపోతే ఏసీబీ, ఈడీ అధికారులు ఒకే విధమైన ప్రశ్నలు అడిగారని మాత్రం కామెంట్ చేశారు. ఈడీ విచారణను ఎద్దేవాచేస్తు ఏమీ మాట్లాడలేదు. ఏసీబీ విచారణతర్వాత అంతహేళనగా మాట్లడిన కేటీఆర్ ఈడీ విచారణ తర్వాత మాత్రం ఎందుకింత కంట్రోల్డ్ గా ఉన్నారు ?
ఎందుకంటే, అరెస్టుభయంతోనే అని అర్ధమవుతోంది. ఇప్పటికే ఫార్ములా కార్ రేసు కేసులో తన అరెస్టు తప్పదని కేటీఆర్ మానసికంగా సిద్ధమైపోయారు. ఈ విషయాన్ని తానే స్వయంగాచెప్పుకున్నారు. కాకపోతే పైకి మేకపోతు గాంభీర్యాన్ని కనబరుస్తున్నారంతే. ఈడీ విచారణతర్వాత బయటకొచ్చిన కేటీఆర్ విచారణకు సంబంధించిన అంశాలు మాట్లాడకుండా ఓటుకునోటు కేసుపై రేవంత్(Revanth) కు సవాలు విసరటమే విచిత్రంగా ఉంది. తామిద్దరిపైనా ఏసీబీ కేసులున్నాయని, ఈడీ విచారణ జరుగుతోంది కాబట్టి కేసుల విషయమై లైడిటెక్టర్ టెస్టుకు రెడీనా అని రేవంత్ ను రెచ్చగొట్టడమే ఆశ్చర్యంగా ఉంది. కేసుల విచారణలో లైడిటెక్టర్ టెస్టుకు రేవంత్ ను సవాలుచేయాల్సిన అవసరమేలేదు. అయినా అప్రస్తుతంగా సీన్ లోకి రేవంత్ ను ఎందుకు లాగినట్లు ? ఎందుకంటే ఈడీ విచారణలో ఏమి జరిగిందనే విషయాన్ని మీడియాతో చెప్పటం ఇష్టంలేని కేటీఆర్ అప్రస్తుతంగా రేవంత్ ప్రస్తావన తీసుకొచ్చారని అర్ధమవుతోంది.
కవిత అనుభవం
ఇదేసమయంలో ఈడీతో చెల్లెలు కవిత అనుభవం కూడా బహుశా కేటీఆర్ కు బాగా గుర్తిండిపోయిందేమో. ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) లో అరెస్టయిన కవిత(Kavitha) దాదాపు ఆరుమాసాలు తీహార్ జైలు(Tihar Jail)లో ఉన్నారు. విచారణలో కవిత ఈడీ ముప్పుతిప్పలు పెట్టడమే కాకుండా కోర్టులో బెయిల్ రాకుండా తీవ్రంగా అడ్డుకున్నది. ఈడీ విచారణ, అరెస్టు కారణంగానే కవిత తీహార్ జైలులో ఆరుమాసాలున్న విషయం తెలిసిందే. ఎక్కువతక్కువ మాట్లడితే తనను కూడా ఈడీఅధికారులు ఢిల్లీకి తీసుకెళతారన్న భయంతోనే కేటీఆర్ చాలాజాగ్రత్తగా ఉంటున్నట్లు అనుమానంగా ఉంది. మొత్తానికి కారణంఏదైనా కేటీఆర్ లో మార్పయితే కొట్టొచ్చినట్లు కనబడుతోందన్నది మాత్రం వాస్తవం.