చేసేది సాఫ్ట్ వేర్ ఉద్యోగం, అమ్మేది గంజాయి

అరకిలో గంజాయి అమ్మడానికి అద్దెకు కారు..;

Update: 2025-07-04 05:43 GMT

సాఫ్ట్వేర్ ఉద్యోగంతో వస్తున్న జీతం సరిపోలేదంటూ స్నేహితుడి సహకారంతో గంజాయి అమ్మకాలకు దిగిన ్ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ని ఎక్సైజ్ ఎస్.టి.ఎఫ్ డి టీం అదుపులోకి తీసుకుంది. అతగాడు   ఏకంగా ఒక కారును అద్దెకు తీసుకొని కారులో గంజాయి(Cannabis) అమ్మకాలు చేపడుతూ ఎక్సైజ్ ఎస్.టి.ఎఫ్ డి టీం సీఐ నాగరాజు బృందానికి పట్టుబడ్డాడు.

మల్లేపల్లి మంగళహాట్ బస్తి లో నివాసం ఉంటూ ఉన్న మహమ్మద్ నదీమ్(26) అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి అర్జున్ రెడ్డి అనే వ్యక్తితో స్నేహం ఏర్పడింది. స్నేహం కాస్త గంజాయి అమ్మకాల వరకు వెళ్ళింది.
అర్జున్ రెడ్డి తీసుకు వచ్చినటువంటి గంజాయిని లాంగ్ డ్రైవ్ యాప్ ద్వారా బుక్ చేసుకుని నారాయణగూడ ప్రాంతంలో అమ్మకాలు చేపడుతున్న తరుణంలో ఎస్.టి.ఎఫ్ డి టీం సీఐ నాగరాజు సిబ్బంది కలిసి నారాయణగూడ పార్క్ సమీపంలో పట్టుకున్నారు.
నిందితుడు వద్ద నుంచి 500 గ్రాముల గంజాయిని కారును సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సాఫ్ట్వేర్ నదీమ్ ను అరెస్ట్ చేసి నారాయణగూడ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. గంజాయి అమ్మకాలకు గంజాయి ఇచ్చిన అర్జున్ రెడ్డి పై కూడా కేసు నమోదు చేశారు అతను పరారీలో ఉన్నాడు.

మరో కేసులో...
రమావత్ లోక్నాథ్ నాయక్ (29) అనే డెలివరీ బాయ్ కుకట్ ప ల్లి ఫోర్త్ స్టేజి వద్ద గంజాయి అమ్మకాలకు పాల్పడుతున్నారని సమాచారం మేరకు అతని బాలానగర్ ప్రాంతంలో పట్టుకున్నారు. నిందితుడు వద్ద నుంచి 2.1 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిది అనంతపూర్ జిల్లా పీకే పీ తండా నల్లమడ ప్రాంతం. కెపిహెచ్బిలో నివాసముంటు గంజాయి అమ్మకాలు చేపడుతున్నట్లు ఎస్ సి ఎఫ్ డి టీం లీడర్ నాగరాజు తెలిపారు. నిందితుడిని గంజాయిని బాలానగర్ స్టేషన్లో అప్పగించారు.


Tags:    

Similar News