కొలనుపాక జైన విద్యా కేంద్రం విశేషమేమిటంటే...

అక్కడి జైనశిల్ప సంగ్రహాలయంలో ఎన్నో అపురూప శిల్పాలు,శాసనాలు ఉన్నాయి

Update: 2024-07-28 07:30 GMT


ప్రసిద్ధ కొలనుపాక జైనదేవాలయం ప్రాంగణంలో దక్షిణంలో పాకశాల పక్కన జైనశిల్ప సంగ్రహాలయం వుంది. అందులో వున్నవి వందలోపు శిల్పాలు,శాసనాలే కాని, అపురూపమైనవి అవి.

వాటిలో జైన చౌముఖి స్తంభాలు, జైనస్తూప ప్రతిమ, జైన యక్షిణులు, జైనగురువులు, జైన తీర్థంకరులు, బాహుబలి విగ్రహాలున్నాయి. చదివి పాఠాలు రాయాల్సిన శాసనాలు కూడా వున్నాయి. సంగ్రహాలయం బయట కనిపించిన ఒక రాతిస్తంభం మీద జైన మహావీరుడు, అతనికింద వ్యాసపీఠానికి ఎదురుగా ఒక జైన ఉపాధ్యాయుడు వ్యాఖ్యానముద్రతో కూర్చుని కనిపిస్తున్నాడు.




 ఈ శాసనస్తంభం జైనుల విద్యాలయానికి చెందిన సరస్వతిగచ్ఛకు చెందిన శాసన స్తంభం మీద తెలుగన్నడలిపిలో కన్నడ శాసనముంది. లిపిని బట్టి ఇది కళ్యాణీచాళుక్యులకాలం, 10,11వ శతాబ్దాలనాటిది. జైనమూలసంఘంలోని సామిదేని గణానికి చెందిన సరస్వతిగచ్ఛను తెలిపే శాసనమిది. ఇది జైనుల విద్యాకేంద్రానికి సాక్ష్యం

శాసనంగుర్తింపు, పరిష్కరణ: శ్రీరామోజు హరగోపాల్

ఇటువంటి శిల్పాలు హన్మకొండ పద్మాక్షిగుట్టమీద, రాయచూరులో అగుపించాయి. పుస్తకగచ్ఛ విద్యాలయాలకు, విద్యాబోధనకు చిహ్నం. జైనబసదుల్లో వైద్యం, విద్య అందరికి ఉచితంగా అందించేవారని శాసనాలు, జైనసాహిత్యం వల్ల తెలుస్తున్నది. ఇపుడీ శాసనంవల్ల కొలనుపాక కూడా జైనవిద్యాకేంద్రమని చెప్పవచ్చు. బౌద్ధారామాల్లో, జైనబసదుల్లో, శైవమఠాల్లో విద్యాబోధనలు, వైద్యసేవలు అందించేవారని తెలిపే శాసనాలిదివరకే లభించాయి. ఈ శాసనం వాటిలో చేర్చదగిన కొత్త శాసనం అని శాసనాన్ని గుర్తించి పరిష్కరించిన శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. ఆయన కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి చెందిన విరువంటి గోపాలకృష్ణ, గణేశ్ లాల్ లతో కలసి ఈ కేంద్రం సందర్శించారు.





కొలనుపాక జైనమ్యూజియం సరస్వతిగచ్ఛ

(జైనచిహ్నాలు-గృధ్రపింఛం-సొరకాయబుర్ర)

1. శ్రీ వర్ధమాన

2. సు.. జైనస్వతిర్తో

3. శ్రీమూలసం

4. ఘెనుబిసితి

5. సామిదేనిగణా

6. ..సరతాసిప్రహ

7. .................

శాసనస్తంభానికి బయటకు తీస్తేగాని పూర్తి శాసనం లభించదు. లభిస్తేగాని కొత్త చరిత్ర మనకు తెలియదని హరగోపాల్ తెలిపారు.



Tags:    

Similar News