హైదరాబాద్ నగరం ఏవైపు విస్తరిస్తోంది!

రెండు రాష్ట్రాల్లోని ముఖ్య ప్రాంతాలకు కనెక్టివిటీ రోడ్డు కావడంతో రియల్‌ ఎస్టేట్‌కు ప్లస్‌ పాయింట్‌గా మారింది.

Update: 2024-01-29 03:20 GMT
హెచ్.ఎం.డి.ఎ. మాస్టర్ ప్లాన్ లో భాగం..

తెలంగాణ రాష్ట్ర ఆదాయానికి గుండెకాయ హైదరబాద్ మహానగరం. ఈ నగరానికున్న భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా నగరం నలుదిశలా శరవేగంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు 160 చదరపు కిలోమీటర్లుగా ఉన్న నగరం ఇప్పుడు దగ్గరదగ్గర ౬౫౦ చదరపు కిలోమీటర్లు దాటి పోయింది. దీంతో మహానగరంలో రియల్ ఎస్టేట్ రంగం మహా జోరందుకుంది. ఈ పరిస్థితిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వ పాలకులకు మహానగరం ఓ ఆదాయ వనరైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి కొనసాగింపుగా ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మహానగరాలన్ని నలుదిశలా అభివృద్ధి పథంలో నడిపేలా కసరత్తు మొదలుపెట్టారు. ఇంటర్నల్ రింగ్ రోడ్లు, రీజినల్ రింగ్ రోడ్లు, మెట్రో రైలు విస్తరణ వంటి అనేక అంశాలను తెరపైకి తీసుకువచ్చారు.

ఏ దిక్కుగా నగరం పెరుగుతోందంటే...

హైదరాబాద్‌ అభివృద్ధి నలువైపులా పరుగులు తీస్తోంది. హైదరాబాద్ తూర్పు వైపు ఉన్న విజయవాడ హైవే వైపు రియల్ ఎస్టేట్ రంగం దూసుకెళ్తోంది. ఎల్బీనగర్ నుంచి మొదలు చౌటుప్పల్, సూర్యాపేట వరకు అనేక ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోని ముఖ్య ప్రాంతాలకు కనెక్టివిటీ రోడ్డు కావడంతో రియల్‌ ఎస్టేట్‌కు ప్లస్‌ పాయింట్‌గా మారింది. ఈ హైవే వెంట ఇండస్ట్రియల్ క్లస్లర్స్ ఏర్పాటుపై ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. దీంతో ఈ మార్గంలో రియాల్టీకి మరింత ఊపు వచ్చే అవకాశముంది.

ఇప్పటికే బాగా అభివృద్ధి చెందిన వెస్ట్ సైడ్...

గ్రేటర్ హైదరాబాద్ అన్ని వైపులా అభివృద్ధికి అవకాశమున్న సిటీ. గడిచిన కొన్నేళ్లుగా వెస్ట్ హైదరాబాద్‌ బాగా అభివృద్ది చెందింది. ఐటీ పరిశ్రమను ఆధారం చేసుకుని ఎక్కువ నిర్మాణాలు, ఇతర సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. ఈ ప్రాంతంలో ఒక ఎకరా భూమి 100 కోట్ల రూపాయల ధర పలికిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అక్కడ ప్లాట్లు, విల్లాలు, ఒపెన్ ల్యాండ్స్‌ కూడా భారీ ధర పలుకుతున్నాయి. ఇప్పుడు అదే పద్ధతిలో అభివృద్దికి అవకాశం ఉన్న ప్రాంతం ఈస్ట్ హైదరాబాద్ అంటున్నారు రియల్ రంగ నిపుణులు. విజయవాడ వెళ్లే హైవే మార్గం భవిష్యత్తు రియల్ మార్కెట్‌కు మరింత స్కోప్ ఉందంటున్నారు.

కలిసిరానున్న ఇండస్ట్రియల్ క్లస్టర్...

హైదరాబాద్ - విజయవాడను కలిపే ఈ హైవే మార్గంలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మంచి రవాణా సౌకర్యంతోపాటు... ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండటం ఇందుకు ప్రధాన కారణం. ఈ రోడ్డు విస్తరణ అంశం కూడా కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌ ఈస్ట్‌ ప్రాంతంలో భూముల ధరలు అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు వంటి మౌలిక వసతులు ఇక్కడ రియాలీటి రంగానికి ప్లస్ కానున్నాయి. మిగతా ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్‌ ఈస్ట్‌ సైడ్‌ భూముల ధరలు కాస్త అనుకూలంగా ఉన్నాయి. మౌలిక సదుపాయాలు భారీగా పెరుగుతుండడంతో ఆ ప్రాంతాల్లో రియల్టీ రంగం ఫుల్‌ జోష్‌లో ఉంది. ప్రస్తుతం రియల్టీ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈస్ట్‌ హైదరాబాద్‌ ప్రస్తుతం బెస్ట్‌ ఆప్షన్‌గా మారిందన్నది చోటా మోటా రియల్టర్ల వాదన. అయితే కొనుక్కునే వాళ్లు ఒకటికి రెండుసార్లు ఆలోచించే కొనుక్కుంటారనేది కూడా నిజమేనని ఓ మధ్యతరగతి ఉద్యోగి కిషోర్ అభిప్రాయం.

Tags:    

Similar News