సింగరేణి గనుల్లో కొనసాగిన కాంగ్రెస్ గాలి, పత్తాలేని బిఆర్ ఎస్
సింగరెేణి కార్మిక సంఘం బిఆర్ ఎస్ చేజారింది. కెసిఆర్ అధికారంలో ఉన్నపుపుడు చేతికి చిక్కింది. అధికారం పోగానే పోయింది. సింగరేణి ఎన్నికల రిపోర్టు
రామగుండం: తెలంగాణలో బుధవారం జరిగిన సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ సంస్థ INTUC, సీపీఐ అనుబంధ సంఘం AITUC గెలిచాయి. బొగ్గు గనులకు చాలా ప్రతిష్టాత్మకమయిన ఈ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ప్రభావం ఏ మాత్రం కనిపించకపోవడం ఆశ్చర్యం. ప్రభుత్వం పోగానే, కార్మికులు ఆ పార్టీని వదిలేశారు. పార్టీకూడా గనులను వదిలేసింది. బొగ్గు గని కార్మిక సంఘానికి మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవితే నాయకురాలు.గౌర అధ్యక్షురాలు. ఆమె కనుసన్నల్లో నడిచే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) పత్తా లేకుండా పొయ్యింది. సింగరేణి ఎన్నికల్లో 13 సంఘాలు పోటీ చేశాయి. ఏఐటీయూసీ, కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్‌టీయూసీ ల మధ్యే ప్రధానంగా పోటీ నడిచింది.
సింగరేణి ఎన్నికల్లో ఆత్మసాక్షిగా ఓటు వేసి టీబీజీకేఎస్‌ను గెలిపించాలని వారం రోజుల కిందట కార్మికులను కోరారు. సింగరేణి గనులను కేసీఆర్ కాపాడారని టీబీజీకేఎస్‌ను గెలిపిస్తేనే కార్మికులకు న్యాయం జరుగుతుందని ఆమె ప్రకటనలో విడుదల చేశారు.అని కార్మికులెవరూ దీనిని పట్టించుకున్నట్లు లేదు. అంతకుముందు ఎన్నికల్లో బిఆర్ ఎస్ అనుబంధ సంస్థ పోటీ చేయదని కెసిఆర్ ప్రకటించారు. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి నెల తిరక్క ముందే ఈ ఎన్నికలు వస్తున్నందన, ఓటమి తప్పదనే భావం పార్టీ లో ఉంది. అందుకే పెద్ద శ్రద్ధ తీసుకోలేదు.
సింగరేణి ప్రాంతంలో 11 ఏరియాలున్నాయి. వాటిలో 6 చోట్ల కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్‌టీయూసీ, 5 చోట్ల సిపిఐ అనుబంధ సంస్థ ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘాలుగా గెలుపొందాయి. గడిచిన రెండు దఫాల్లో గుర్తింపు సంఘంగా ఉన్న బీఆర్‌ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ కు తిరుగులేని శక్తి. ఇపుడసలు పోటీలో లేకుండా పోయింది.
ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న 11 ఏరియాల్లో ప్రాతినిధ్య సంఘాలు, గుర్తింపు సంఘం ఎన్నికకు బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల పోలింగ్ జరిగింది.
మొత్తం 39,773 ఓటర్లుంటే 37,468 ఓట్లు పోలయి 94.20 శాతం పోలింగ్ నమోదైంది అత్యధికంగా ఇల్లెందు ఏరియాలో 98.37 శాతం, అతి తక్కువగా శ్రీరాంపూర్, రామగుండం-3 ఏరియాల్లో 93 శాతం పోలింగ్ నమోదయ్యింది.7 గంటల నుంచి డివిజన్ల వారీగా ఓట్ల లెక్కింపు మొదలయింది.
బెల్లంపల్లి రీజియన్ పరిధి లోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల్లో ఏఐటీయూసీ విజయం సాధించింది. రామగుండం రీజియన్ లోని రామగుండం-1, 2 ఏరియాల్లో ఏఐటీయూసీ, రామగుండం-3 లో ఐఎన్‌టీయూసీ విజయం సాధించింది. కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయంలో, మణుగూరు, ఇల్లెందు, కొత్తగూడెం, భూపాలపల్లి ఏరియాల్లో ఐఎన్‌టీయూసీ గెలుపొందాయి.
.