కేసీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

రాజలింగమూర్తి హత్య ను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని కోరుతున్నా. హత్యలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, గండ్ర వెంకటరమణ రెడ్డి పాత్ర ఉంది.;

Update: 2025-02-20 08:33 GMT

సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజలింగమూర్తి హత్య వెనక కేసీఆర్, హరీష్ రావు హస్తం ఉందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చేయడంతోనే రాజలింగమూర్తిని పక్కా ప్లాన్ ప్రకారం హతమార్చారని ఆరోపించారు. ఈ ఘటనపై సీబీసీఐడీతో విచారణ జరిపిస్తామని చెప్పారు. దీని వెనక ఉవరున్నా వదిలి పెట్టేది లేదని, రాజలింగమూర్తికి న్యాయం అందించడానికి ఎంతదూరమైనా వెళతామని అన్నారు. అదే విధంగా కేసీఆర్ నుంచి ఎవరికైనా ప్రాణభయం ఉంటే.. వారు ప్రభుత్వాన్ని ఆశ్రయించాలని, ప్రభుత్వం వారికి తగిన రక్షణ కల్పిస్తుందని తెలిపారు కోమటిరెడ్డి.

‘‘టీఆరెస్ పడేండ్లలో హత్యా రాజకీయాన్ని పెంచి పోషించింది. బీఆర్ఎస్ దోపిడీని ప్రశ్నించిన రాజలింగాన్ని హత్య చేశారు. రాజలింగ మూర్తి హత్యను తీవ్రంగా ఖండిస్తున్న. కాళేశ్వరం ప్రాజెక్టు లో కేసీఆర్ తో పాటు ఐదుగురు పై సామాజిక కార్యకర్త రాజలింగం కోర్టులో కేసు వేశాడు. హత్య గండ్ర వెంకటరమణారెడ్డి చేయించాడు. కాళేశ్వరంలో కేసీఆర్‌కు దోషిగా శిక్ష పడుతుందని కేసీఆర్, కేటిఆర్ లు హత్య చేయించారని రాజలింగమూర్తి కూతురు, భార్య చెప్తుంది. అడ్వకేట్ వామన రావు, భార్యాభర్త హత్యకు ఎవరు కరణమో అందరికి తెలుసు. వరంగల్ లో ఎంపీడీఓ ను హత్య బీఆర్ఎస్ వాళ్ళు చేశారని అప్పటి సిపి రంగనాథ్ చెప్పారు’’ అని గుర్తు చేశారు.

‘‘కొడంగల్‌లో సాక్షాత్తు జిల్లా కలెక్టర్‌పై కూడా సురేష్ అనే రౌడీ షీటర్ దాడి చేశారు. బీఆర్ఎస్ లక్ష్యం ఒక్కటే తెలంగాణలో అభివృద్ధి జరగకూడదనేది. కేసీఆర్ కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిందని అంటుండు. హత్య రాజకీయాలు చేయడమేనా మీ గ్రాఫ్ కేసీఆర్? కేసీఆర్ కిరాయి హత్యలు చేయించడమే తప్ప ఆయనకు ఇంకేమీ రాదు. 15నెలల నుండి పామ్ హౌస్ నుండి ఎప్పుడైనా బయటకి వచ్చిండా? రాజలింగమూర్తి హత్య ను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని కోరుతున్నా. హత్యలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, గండ్ర వెంకటరమణ రెడ్డి పాత్ర ఉంది. సీబీ సీఐడీ విచారణ చేసి 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేయాలి’’ అని కోరారు.

‘‘పాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి వెంటనే శిక్ష వేయాలి. హత్యను సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ గా తీసుకుంటాడు. లగచర్లలో లో కూడా కలెక్టర్ ను చంపాలని చూసిండ్రు. తెలంగాణలో హత్య రాజకీయాలకు తావు లేదు. అవినీతి మీద పోరాడే వారికి రక్షణ కల్పిస్తాం. హరీష్ రావు అవినీతి మీద పోరాడుతున్న చక్రధర్ కూడా రక్షణ కల్పిస్తాం. తెలంగాణ ను దోచుకొని తిని ఎదురు తిరిగిన వాళ్ళను చంపేస్తారా? పాపం తగిలి పోతారు’’ అని విమర్శలు చేశారు. కాగా రాజలింగమూర్తి హత్యలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ హస్తముందని మంత్రి వ్యాఖ్యానించడం ప్రస్తుతం కీలకంగా మారింది. కోమటిరెడ్డి వ్యాఖ్యలతో కేసీఆర్ అరెస్ట్‌కు రంగం సిద్ధమవుతోందని, రాజలింగమూర్తి అరెస్ట్‌ ఉచ్చు కేసీఆర్ మెడకు రోజురోజుకూ మరింత బలంగా బిగుస్తుందన్న చర్చ జోరందుకుంది.

Tags:    

Similar News