రేవంత్ కు అరుదైన అవకాశం

ఢిల్లీలోని కాన్ స్టిట్యూషనల్ క్లబ్ లో ప్రత్యేకంగా సదస్సు నిర్వహించాలని కూడా రేవంత్(Revanth) డిసైడ్ అయ్యాడు.;

Update: 2025-07-13 12:02 GMT
Revanth Reddy

బీసీ రిజర్వేషన్ల అంశంపై ఎనుముల రేవంత్ రెడ్డి ఇండియాకూటమిలోని ఎంపీలకు మార్గదర్శనం చేయబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం ముందుగా ఈనెల 16, 17 తేదీల్లో ఢిల్లీలో క్యాంపు వేయబోతున్నాడు. రెండు రోజుల్లో కాంగ్రెస్ లోని అగ్రనేతలను కలిసి 42శాతం రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ జారీ విషయాన్ని వివరించబోతున్నాడు. అలాగే దేశంలో బీసీలకు రిజర్వేషన్లు పెంచాల్సిన ఆవస్యకతను తెలియజేయాలని డిసైడ్ అయ్యారు. ఢిల్లీలోని కాన్ స్టిట్యూషనల్ క్లబ్ లో ప్రత్యేకంగా సదస్సు నిర్వహించాలని కూడా రేవంత్(Revanth) డిసైడ్ అయ్యాడు.

ఈనెల 21వ తేదీనుండి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ఆసందర్భంగా తెలంగాణలోని పార్టీ ఎంపీలతో రేవంత్ ఢిల్లీకి చేరుకోవాలని అనుకున్నాడు. సమావేశాల మొదటిరోజు లేదా రెండు రోజుల తర్వాత రిజర్వేషన్లపై రేవంత్ ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తెలంగాణలో బీసీల కోసం ఆర్డినెన్స్ జారీ అంశాన్ని పార్లమెంటు ఉభయసభల్లో డిమాండ్ చేయాలని రేవంత్ ఎంపీలను రిక్వెస్టు చేయబోతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఈపవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు ఇండియాకూటమిలోని(INDIA) ఎంపీలందరినీ ఆహ్వానించబోతున్నాడు. ఇండియాకూటమి ఎంపీలందరినీ ఆహ్వానించే విషయమై పార్టీ అగ్రనేతల సహకారం తీసుకోవాలని అనుకున్నారు.

ఇక్కడివరకు రేవంత్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ బాగానే ఉంది కాని అనుకున్నది అనుకున్నట్లు జరిగితేనే. తొందరలోనే జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ పెంపు అంశాన్ని అన్నీరాష్ట్రాల్లో ఎన్నికలఅస్త్రంగా మలుచుకోవాలని పార్టీ అగ్రనేతలకు రేవంత్ సూచించబోతున్నాడు. తొందరలోనే జరగబోయే బీహార్ ఎన్నికల్లోనే బీసీ అస్త్రాన్ని(BC Reservations) ప్రయోగం మొదలుపెట్టాలని రేవంత్ పార్టీ అగ్రనేతలకు గట్టిగా చెబుతున్నాడు. ప్రయత్నాలవరకు బాగానే ఉందికాని చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News