Ramcharan and Balayya|రేవంత్ గట్టిగా నిలబడినట్లేనా ?

బెనిఫిట్ షోలు వేసుకోవటానికి, సినిమా టికెట్ల ధరలు పెంచుకోవటానికి చంద్రబాబునాయుడు(Chandrababu) ప్రభుత్వం పచ్చజెండా ఊపేసింది.;

Update: 2025-01-05 07:35 GMT
Ramcharan and Balayya

సినీపరిశ్రమ విషయంలో చెప్పినమాటమీద రేవంత్ రెడ్డి గట్టిగా నిలబడినట్లే ఉన్నాడు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు బెనిఫిట్ షోలు, ప్రీమీయిర్ షోలు, టికెట్ల రేట్ల పెంపు ఉండదని రేవంత్(Revanth) అసెంబ్లీలో స్పష్టంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తర్వాత సినీప్రముఖులతో జరిగిన భేటీలో బెనిఫిట్ షోలు, ప్రీమీయిర్ షోలు, టికెట్ల ధరల పెంపు అంశం చర్చకు వచ్చింది. అయితే రేవంత్ మాత్రం అసెంబ్లీలో చేసిన ప్రకటనకే కట్టుబడున్నారు. రేవంత్ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేట్లుగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎఫ్డీసీ) ఛైర్మన్ దిల్ రాజు(FDC Chairman DilRaju) రాయబారం కూడా సక్సెస్ కాలేదు. ఇపుడీ విషయం ఎందుకంటే ఏపీలో రెండు పెద్దసినిమాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బెనిఫిట్ షోలు వేసుకోవటానికి, సినిమా టికెట్ల ధరలు పెంచుకోవటానికి చంద్రబాబునాయుడు(Chandrababu) ప్రభుత్వం పచ్చజెండా ఊపేసింది.

సంక్రాంతి పండుగ సందర్భంగా రామచరణ్(Ramcharan) హీరోగా గేమ్ ఛేంజర్(Game Changer), నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా డాకూ మహరాజ్(Daku Maharaj) సినిమాలు విడుదల అవుతున్న విషయం తెలిసిందే. గేమ్ ఛేంజర్ ఈనెల 10వ తేదీన, డాకూ మహరాజ్ సినిమా 12వ తేదీన విడుదలవుతున్నాయి. ఈ రెండుసినిమాల నిర్మాతలు ప్రభుత్వాన్ని కలవగానే వెంటనే బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లుపెంచటానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. మరిదే సినిమాలకు తెలంగాణాలో మాత్రం బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు లేవు, టికెట్ల ధరల పెంపు కూడా లేదు. హీరోలకు కోట్లాదిరూపాయల రెమ్యునరేషన్ ఇచ్చుకుంటున్న నిర్మాతలు ఆ మొత్తాన్ని తిరిగి రాబట్టుకోవాలని అనుకోవటం సహజం. హీరోలకు ఇచ్చిన రెమ్యునరేషన్ తిరిగి రాబట్టుకోవటం ఎలాగ ? ఎలాగంటే ఇలాగే. అంటే బెనిఫిట్, ప్రీమియర్ షోల పేరుతో టికెట్ల ధరలను నిర్మాతలు తమిష్టమొచ్చినట్లు పెంచుకుంటున్నారు.

టికెట్ల ధరలు ఎంతఎక్కువగా నిర్ణయించినా మొదటిరోజు, మొదటిషోనే చూడాలని అనుకునే అభిమానులుంటారు. వాళ్ళ పిచ్చిఅభిమానాన్నే నిర్మాతలు అడ్వాంటేజ్ తీసుకుని తమ పెట్టుబడుల్లో కొంత తిరిగి ఈరూపంలో రాబట్టుకుంటున్నారు. 2024, డిసెంబర్ 4వ తేదీన పుష్ప సినిమా(Pushpa Movie) రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిందిదే. సినిమా రిలీజ్ సందర్భంగా ప్రమోషన్ కోసం అల్లుఅర్జున్ థియేటర్ కు వచ్చినపుడు జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కొడుకు శ్రీతేజ్ కోమాలోకి వెళ్ళిపోయాడు. ఘటనకు కారకుడైన హీరో అల్లుఅర్జున్(AlluArjun) పై పోలీసులు కేసు నమోదుచేయటమే కాకుండా అరెస్టు కూడా చేశారు. థియేటర్లో బెనిఫిట్ షో వేయటమే కాకుండా ప్రమోషన్ కోసం అల్లుఅర్జున్ రావటంవల్లే తొక్కిసలాట జరిగిందన్న కారణంగా బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు, టికెట్ల ధరలు పెంపు ఉండదని రేవంత్ ప్రకటించారు. రేవంత్ నిర్ణయం చాలామంది నిర్మాతలకు పెద్ద షాకనే చెప్పాలి. అయినా సరే తన ప్రకటననుండి రేవంత్ వెనక్కుపోకుండా గట్టిగా నిలబడ్డారు. అందుకనే ఇపుడు నిర్మాతల దృష్టంతా ఏపీపైనే ఉంది.

ఈ రెండే కారణాలా ?

పై రెండుసినిమాల బెనిఫిట్ షోలకు, టికెట్ల ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వటంలో రెండుకారణాలున్నాయనే అనుమానాలు పెరుగుతున్నాయి. అవేమిటంటే గేమ్ ఛేంజర్ సినిమాలో హీరో రామ్ చరణ్ కు డిప్యూటీ సీఎం వపన్ కల్యాణ్ స్వయాన బాబాయ్ అవుతాడు. చిరంజీవి కొడుకు హీరోగా నటించిన సినిమాకు అడిగిన తర్వాత బెనిఫిట్ షో, ప్రీమియర్ షోలే కాకుండా టికెట్ల ధరల పెంపును కాదనే అవకాశమే లేదు. ఇదేసమయంలో రెండో సినిమా డాకూ మహరాజ్ లో హీరో నందమూరి బాలకృష్ణ హిందుపురం ఎంఎల్ఏ కమ్ చంద్రబాబు బావమరది కమ్ వియ్యంకుడు. కాబట్టి ఈ ఇద్దరి సినిమా నిర్మాతలు అలా అడగ్గానే ప్రభుత్వం ఇలా ఓకే చెప్పేసినట్లుంది. మరిదే పద్దతి ఇతర హీరోలు నటించిన సినిమాలకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా ?

Tags:    

Similar News