ED countdown|కౌంట్ డౌన్ మొదలవుతోందా ?

గురువారం ఉదయం 10 గంటలకు హెచ్ఎండీఏలో చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన బీఎల్ఎన్ రెడ్డిని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారించబోతోంది.;

Update: 2025-01-01 08:43 GMT
ED countdown

ఫార్ములా ఈ కార్ రేసు అవినీతి విచారణకు కౌంట్ డౌన్ మొదలైనట్లే అనుకోవాలి. గురువారం ఉదయం 10 గంటలకు హెచ్ఎండీఏలో చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన బీఎల్ఎన్ రెడ్డిని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారించబోతోంది. బషీర్ బాగ్ లోని తమ కార్యాలయంలో జనవరి 2వ తేదీ ఉదయం 10 గంటలకల్లా హాజరవ్వాలని మాజీ చీఫ్ ఇంజనీర్ కు ఈడీ నోటీసులో స్పష్టంగా చెప్పింది. 2వ తేదీ రెడ్డి విచారణ తర్వాత 3వ తేదీన సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ విచారణకు హాజరవ్వాల్సుంటుంది. 7వ తేదీ విచారణలో కేటీఆర్ ను విచారించాలంటే అంతకన్నా ముందు బీఎల్ఎన్ రెడ్డి, అర్వింద్ కుమార్ ను విచారించాలన్న ఈడీ నిర్ణయం సరైనదే. ఎందుకంటే రు. 55 కోట్ల అవినీతి జరిగిందని నమ్ముతున్న ప్రభుత్వం జరిగిన అవినీతి ఏ విధంగా జరిగిందనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయగలగాలి. జరిగిన అవినీతికి రుజువులు కావాలంటే ముందు ఉన్నతాధికారులను గట్టిగా విచారిస్తే కాని ఆధారాలు దొరకవు.

కేటీఆర్ ఆదేశాలతోనే రు. 55 కోట్ల బదిలీ జరిగిందని అర్ధమవుతున్నా బదిలీ జరిగిన విధానం ఏమిటన్నది ఎస్టాబ్లిష్ కావాలి. నిధుల బదిలీలో నిబంధనలకు ఏ విధంగా పాతర వేశారన్న విషయం తేలాలి. బదిలీ చేసింది అర్వింద్ అని అర్ధమవుతోంది. అయితే నిధుల బదిలీ, నిధులను అందుకోవటంలో బీఎల్ఎన్ రెడ్డి పాత్రేమిటన్న విషయం బయటపడాలి. కాబట్టి ఫార్ములా కార్(formula Car Race) అవినీతిలో కేటీఆర్(KTR) ను ఫిక్స్ చేయాలంటే ముందు బీఎల్ఎన్ రెడ్డి, అర్వింద్ ఆధారాలతో సహా దొరకాలి. నిధులబదిలీలో నిబంధనలను ఏవిధంగా తుంగలో తొక్కామన్న విషయాన్ని వీళ్ళిద్దరే చెప్పాలి. నిబందనలను తుంగలో తొక్కాల్సిన అవసరం ఏమొచ్చింది ? అందుకు కారణం ఎవరన్న విషయాన్ని వీళ్ళిద్దరు చెప్పాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తనఆదేశాల ప్రకారమే అర్వింద్ నిదులు బదిలీచేశారని కొద్దిరోజుల క్రితం మీడియా సమావేశంలో కమిట్ అయిన కేటీఆర్ ఇపుడేమో నిధుల బదిలీతో తనకు సంబంధంలేదని అడ్డం తిరిగారు.

కేటీఆర్ తాజా వైఖరి కారణంగా అసలు ఏమి జరిగిందన్న విషయాన్ని వీళ్ళిద్దరు స్పష్టంగా చెప్పాలి. అప్పుడే విచారణలో ఎవరిది తప్పన్న విషయంపై ఈడీ(ED)కి క్లారిటివస్తుంది. ఫార్ములా అవినీతిలో ఎవరి పాత్రెంత ? అన్నవిషయాన్ని ఆధారాలతోసహా వీళ్ళిద్దరు బయటకుచెబితేనే నిజమైనదోషులు బయటకువస్తారు. దానికే జనవరి 2వతేదీనుండి కౌంట్ డౌన్ మొదలవ్వబోతోంది.

Tags:    

Similar News