రెండో రోజు కొనసాగుతున్న శ్రీచైతన్య కాలేజీల్లో ఐటీ సోదాలు..

రెండు రకాల సాఫ్ట్‌వేర్‌లను వినియోగిస్తున్న శ్రీచైతన్య విద్యాసంస్థలు. ఒకటి లావాదేవాలకు, మరొకటి పన్ను ఎగవేతకు..!;

Update: 2025-03-11 07:30 GMT

దేశవ్యాప్తంగా ఉన్న శ్రీచైతన్య విద్యాసంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శ్రీచైతన్య విద్యాసంస్థలు పన్ను ఎగవేత అభియోగాలు ఎదుర్కొంటున్నాయి. విద్యార్థుల నుంచి ఫీజులను నగదు రూపంలో అందుకుంటూ వాటికి పన్నులు చెల్లించకుండా ఎగవేస్తోందన్న ఆరోపణల నేపథ్యంలోనే ఐటీ అధికారులు సోదాలు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, బెంగళూరు, పూణె నగరాల్లో ఏకకాలంలో సోదాలు ప్రారంభించారు. సోమవారం మొదలైన ఈ సోదాలు మంగళవారం కూడా కొనసాగుతున్నాయి. మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న శ్రీ చైతన్య కళాశాల ప్రధాన కార్యాలయంలో కార్పొరేట్ వ్యవహారాలు, విద్యార్థులకు సంబంధించిన లావాదేవీలు జరుగుతున్నాయని సమాచారం. ఇక్కడ సుమారు 20 మంది ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సిబ్బంది సహకారంతో అధికారులు గతంలో ఐటీ శాఖకు సమర్పించిన రిటర్న్స్‌ను పరిశీలిస్తున్నారు.

దాంతో పాటుగా విద్యార్థుల నుంచి విద్యార్థుల నుంచి నగదు లావాదేవీలు చేయడం కోసం శ్రీచైతన్య విద్యాసంస్థలు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నాయి. అదే విధంగా మరో సాఫ్ట్‌వేర్ ద్వారా పన్ను చెల్లింపుల నుంచి కూడా ఈ విద్యాసంస్థలు తప్పించుకుంటున్నాయని అనుమానాలు తీవ్రంగా వ్యక్తమయ్యాయి. శ్రీచైతన్య సంస్థ నిర్మించిన సాఫ్ట్‌వేర్ ద్వారా నగదు, ఫీజు చెల్లింపులు సులభతరం అవుతాయని సంస్థ పేర్కొంది. కాగా విద్యర్థుల నుంచి తీసుకున్న నగదు మొత్తం, పన్ను చెల్లించకుండా బయటకు మళ్లిస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. కొంతకాలంగా తమకు అందిన సమాచారం ఆధారంగానే అధికారులు సోదాలు చేస్తున్నారు. అన్ని రకాల దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. భారీ పోలీసు భద్రత మధ్య ఈ సోదాలు జరుగుతున్నాయి. కాగా ఈ సోదాలు రేపు కూడా కొనసాగొచ్చని తెలుస్తోంది.

Tags:    

Similar News