మాజీ ఎంపీ ఇంట్లో ఐటీ సోదాలు..
డీఎస్ఆర్ సంస్థ లావాదేవీల్లో అవకతవకలు జరిగాయన్న అభియోగాల నేపథ్యంలో సోదాలు.;
మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆక్ష్నకు సంబంధించిన డీఎస్‌ఆర్ గ్రూప్ కన్‌స్ట్రక్షన్ సంస్థకు సంబంధించిన లావాదేవీల్లో అవకతవకలు ఉన్నాయన్న అనుమానంతో ఐటీ శాఖ ఈ సోదాలు చేస్తోంది. సంస్థ సీఈఓ సత్యనారాయణరెడ్డి, ఎండీ సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి నివాసం, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, సూరారం, నెల్లూరు, బెంగళూరు సహాలు మొత్తం 15 ప్రదేశాల్లో ఐటీ బృందాలు సోదాలు జరుపుతున్నాయి. కొంత కాలంగా డీఎస్ఆర్ సంస్థ పన్ను చెల్లింపులు సరిగా చేయడం లేదని, వాటిలో భారీ అవకతవకలు జరిగాయని అధికారులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా రంజిత్ రెడ్డి నివాసంలో సోదాలు చేస్తున్నారు. ఈ సోదాలు సాయంత్రం వరకు సాగే అవకాశం ఉందని తెలుస్తోంది.