తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల జాతర

తెలంగాణ ఆర్టీసీలో తొందరలోనే 3038 ఉద్యోగాలను భర్తీచేయటానికి ప్రభుత్వం రెడీఅవుతోంది.;

Update: 2025-04-20 09:03 GMT
Transport minister Ponnam Prabhakar

తెలంగాణ ఆర్టీసీలో తొందరలోనే 3038 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది. చాలాకాలంగా ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు జరగలేదు. రిటైర్ అయ్యే ఉద్యోగుల ఖాళీలను భర్తీ చేయక, అప్పటికే భర్తీ చేయాల్సిన ఖాళీలను కూడా ప్రభుత్వం భర్తీ చేయలేదు. ఫలితంగా రిటైర్ అవ్వగా సర్వీసులో ఉన్న ఉద్యోగులు, కార్మికుల మీద పనిభారం విపరీతంగా పెరిగిపోయింది. రేవంత్ ప్రభుత్వం (Revanth Government) అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ (Telangana RTC) సమీక్షల్లో ఉద్యోగాల భర్తీ అవసరాన్ని గుర్తించింది. అందుకనే 3038 ఉద్యోగాలను భర్తీ భర్తీచేయబోతున్నట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.

ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి (RTC Jobs) తొందరలోనే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లు మంత్రి తెలిపారు. సుదీర్ఘకాలం తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తుండటం పట్ల మంత్రి హర్షం వ్యక్తంచేశారు. 3 వేల ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం అన్నీ అనుమతులు ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. నోటిఫికేషన్ (Job Notification) జారీ అవ్వటమే మిగిలిందన్నారు. సాధ్యమైనంత తొందరలోనే నోటిఫికేషన్ జారీ అవుతుందన్నారు. రేవంత్ నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.

మహాలక్ష్మి పథకంలో ఉచిత (Free Bus Scheme) ప్రయాణం ద్వారా ఇప్పటికి 165 కోట్ల కోట్ల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణం చేసినట్లు మంత్రి చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణాల ద్వారా 165 కోట్ల మంది రూ. 5500 కోట్లను ఆదా చేసినట్లు ప్రకటించారు. మహాలక్ష్మి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడం కోసం కొత్త బస్సులు కొంటున్నట్లు చెప్పారు. భర్తీ చేయబోయే ఉద్యోగాల్లో డ్రైవర్లే 2 వేలమంది ఉంటారన్నారు. శ్రామికులు 743, డిప్యూటీ సూపరెండెంట్ (ట్రాఫిక్) పోస్టులు 84, డిప్యూటీ సూపరెండెంట్ పోస్టులు 114, డిపో మేనేజర్/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ పోస్టులు 25, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ పోస్టులు 18, అసిస్టెంట్ సివిల్ ఇంజనీర్ పోస్టులు 23, సెక్షన్ ఆఫీసర్ (సివిల్) పోస్టులు 11, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు 6, మెడికల్ ఆఫీసర్ జనరల్ పోస్టులు 7, మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్టు పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 15 మాసాల్లోనే వివిధ శాఖల్లో 60 పోస్టులు భర్తీ భర్తీచేసినట్లు పొన్నం తెలిపారు. మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం అయినట్లు చెప్పారు.

Tags:    

Similar News