'ఆందోళనలో బీజేపీ కీలక నేతలు'
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ శాతం తగ్గగా... ఇండియా కూటమి ఓటింగ్ 7 శాతం పెరిగిందని అన్నారు. బీజీపీ ఓటింగ్ శాతం తగ్గడంతో మోదీ, అమిత్ షా లో భయం మొదలైందని కడియం విమర్శించారు.
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీజేపీపై విమర్శలు గుప్పించారు. అన్నారు. ఆదివారం జనగామ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. కేంద్రంలో బీజీపీ పార్టీకి అనుకున్న విధంగా ఫలితాలు రాకపోవడంతో ఆ పార్టీ కీలక నేతలు ఆందోళనలో ఉన్నారన్నారు. ఇప్పటికైనా బీజీపీ నాయకులు ఎగిరెగిరి పడటం మానుకొని దేశం, రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ శాతం తగ్గగా... ఇండియా కూటమి ఓటింగ్ 7 శాతం పెరిగిందని అన్నారు. బీజీపీ ఓటింగ్ శాతం తగ్గడంతో మోదీ, అమిత్ షా లో భయం మొదలైందని కడియం విమర్శించారు.
రామ మందిరం కట్టిన ఫైజాబాద్‌లో కూడా బీజీపీ అభ్యర్థి గెలవడం రాముడికి ఇష్టం లేదన్నారు. ఎన్డీఏ కూటమి నుంచి చంద్రబాబు, నితీష్ కుమార్ వైదొలిగితే ఆ ప్రభుత్వమే గందరగోళంలో పడుతుందన్నారు. లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి తాను రావడంతో ప్రజల తీర్పు ఎలా ఉంటుందోనని ఆందోళన పడ్డాను అన్నారు. కానీ, స్టేషన్ ఘనపూర్ ప్రజలు తన పార్టీ మార్పును కూడా స్వాగతించారని చెప్పుకొచ్చారు. తన కుమార్తె, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యకు 56 వేల మెజార్టీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ఆదరణ పెరిగిందని వ్యాఖ్యానించారు.
ప్రజల చేతిలో ప్రజాస్వామ్యం భద్రంగా ఉంది, కాంగ్రెస్ ప్రజల గుండెల్లో పదిలంగా ఉందని కడియం అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఓటమి ఊహించిందే, కానీ నాయకుల మైండ్ సెట్ ఇంకా మారట్లేదని ఎద్దేవా చేశారు. ప్రధాన మంత్రి అవుతానని చెప్పిన కేసీఆర్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయారని విమర్శించారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఉంటుందో, లేదో కూడా తెలియదని పరిస్థితి ఉందని సెటైర్ వేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని కడియం శ్రీహరి విమర్శించారు.